ముగిసిన రాష్ట్ర స్థాయి వృషభాల బల ప్రదర్శన
గుత్తి రూరల్: మండలంలోని తొండపాడు గ్రామంలో వెలసిన బొలికొండ రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వృషభాల బలప్రదర్శన మంగళవారం ముగిసాయి. ఆరు పళ్లు, న్యూ కేటగిరి, సీనియర్ విభాగాల్లో జరిగిన పోటీలు హోరాహోరీగా సాగాయి. అనంతపురం, కర్నూలు, వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య జిల్లాలకు చెందిన వృషభాలు పాల్గొన్నాయి. సీనియర్ విభాగం పోటీల్లో నంద్యాల జిల్లా గుంపరమానుదిన్నెకు చెందిన రైతు కుందూరు రాంభూపాల్‌రెడ్డి వృషభాలు మొదటి స్థానం, వైఎస్సార్‌జిల్లా కల్లూరుకు చెందిన రైతు పెరుమాల్ శివకృష్ణయాదవ్ వృషభాలు రెండవ స్థానం, అనంతపురం రూరల్ మండలం ఎ.నారాయణపురానికి చెందిన రైతు ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి వృషభాలు మూడవ స్థానంలో నిలిచాయి. విజేత వృషభాల యజమానులను అభినందిస్తూ నగదు ప్రోత్సాహాకాలను ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్ అందజేశారు. అలాగే సీనియర్ విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వృషభాల యజమానికి ఓ పాడి ఆవును రైతులు రమేష్‌రెడ్డి, చిలుకూరు కుమార్‌రెడ్డి బహుమతిగా ఇచ్చారు. కార్యక్రమంలో నిర్వాహకులు చిన్నరెడ్డి యాదవ్, రంగస్వామిరెడ్డి యాదవ్, లక్ష్మీరంగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment