గుంతకల్లు టౌన్: ఒడిశా నుంచి గంజాయిని దిగుమతి చేసుకుని గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో విక్రయిస్తున్న గుంతకల్లుకు చెందిన షికారి నాగులు, అశోక్‌కుమార్, తాడిపత్రి నివాసి యర్రగుడి అల్తాఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన పక్కా సమాచారంతో బుధవారం ఉదయం గుంతకల్లులోని ఆలూరు రోడ్డులోని దర్గా ఆర్చ్ వద్ద తచ్చాడుతున్న ముగ్గురినీ అదుపులోకి విచారణ చేయడంతో గంజాయి విక్రయం బయటపడినట్లు వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపారు. వీరి నుంచి 1,100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment