మాతాశిశు సంరక్షణ చర్యలు చేపట్టండి
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలో మాతాశిశు సంరక్షణ చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కుమార్ ఆదేశించారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ప్రకారం తల్లీబిడ్డల వైద్య సేవలు, గర్భిణుల వివరాల నమోదుపైబుధవారం ఆయన డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఈబీదేవితో కలసి వైద్యాధికారులతో సమీక్షించారు. వీడియో కాన్పరెన్స్ ఏర్పాటు చేసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ యుగంధర్, డాక్టర్ అనుపమ, డాక్టర్ రవిశంకర్, ఎస్‌ఓ మహ్మద్ రఫీ, కిషోర్ పాల్గొన్నారు.
పామిడి: మండల కేంద్రంలోని సీహెచ్‌సీతో పాటు రామరాజుపల్లిలోని హెల్త్ క్లినిక్‌ను బుధవారం ఉదయం డాక్టర్ అనిల్‌కుమార్ తనిఖీ చేశారు. ముందుగా పామిడిలోని గుప్తా కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా 11 రకాల వ్యాధులకు సంబంధించిన టీకాలపై కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. అనంతరం సీహెచ్‌సీలో పలు రికార్డులు పరిశీలించారు. రామరాజుపల్లిలో హెల్త్ క్లినిక్‌ను పరిశీలించి 14 రకాల ల్యాబ్ పరీక్షల విధానం, ఎన్‌సీడీ సీడీ సర్వేపై ఆరోగ్యసిబ్బందికి అవగాహన కల్పించారు. ఆయన వెంట ఆర్‌బీఎస్‌కే సీఓ నారాయణస్వామి, ఎద్దులపల్లి వైద్యాధికారి సుధాకర్, సిబ్బంది ఉన్నారు.
వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అనిల్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment