గొంతు తడవక సొమ్మసిల్లి...
పుట్టపర్తి: గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరక్కపోవడంతో ఓ మామిడి తోటలో వాలిన జాతీయ పక్షి నెమలి... అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. బుక్కపట్నం గ్రామానికి చెందిన రైతు చిట్రా నారాయణస్వామి తోటలో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. విపరీతమైన దాహంతో సొమ్మసిల్లిన నెమలిని గమనించిన కొత్త చెరువుకు చెందిన విశ్రాంత సైనికోద్యోగి రవిచంద్ర వెంటనే దానికి సపర్యలు చేపట్టారు. బిందెలతో నీటిని దానిపై పోసిన కాసేపటికి తేరుకుంది. అయినా పైకి స్వేచ్ఛగా ఎగరలేక ఇబ్బంది పడుతుంటే రైతు నారాయణస్వామితో కలసి పోలీసులకు అప్పగించారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గొంతు తడుపుకునేందుకు మూగజీవాలు పడుతున్న ఇబ్బందులకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి ఘటనలో కోకొల్లలుగా చోటు చేసుకుంటున్నా.. వెలుగులోకి కొన్ని మాత్రమే వస్తున్నాయి. సకాలంలో రైతులు గుర్తించడంతో నెమలికి ప్రాణాపాయం తప్పింది. దాహంతో అలమటిస్తున్న పలు వన్యప్రాణులు నీరు అందక మృత్యువాత పడుతుండడం బాధాకరం.
Comments
Please login to add a commentAdd a comment