ఉచిత ఎంబీఏ విద్య కోసం 23న పరీక్ష
పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి సమీపంలోని సంస్కృతి కళాశాలలో ఉచిత ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే సాయి ప్రుడెంట్ స్కాలర్‌షిప్ పరీక్ష ఈ నెల 23 ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను బుధవారం విద్యాసంస్థల చైర్మన్ విజయ్‌భాస్కర్‌రెడ్డి విడుదల చేశారు. అడ్మిషన్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రశాంతి, ప్రిన్సిపాల్ అండ్ డీన్ డాక్టర్ బాలకోటేశ్వరి మాట్లాడుతూ రెండేళ్ల ఎంబీఏ విద్యతో పాటు హాస్టల్ సౌకర్యాలను పొందడానికి సాయి ప్రుడెంట్ స్కాలర్‌షిప్ పరీక్షను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ కోర్సు చదివిన వారు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు 91000 64545, 91009 74544, 91009 74537 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జర్మనీకి చెందిన అన్‌హటా స్టప్టుంగ్ ఫౌండేషన్ సహకారంతో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment