అన్ని సౌకర్యాలుంటేనే సబ్సిడీ పరికరాలు
● ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్‌ఖాన్
కూడేరు: బోరు, మోటార్, విద్యుత్ తదితర అన్ని సౌకర్యాలున్న రైతులకే ప్రభుత్వం సబ్సిడీతో సూక్ష్మ సేద్యం పరికరాలు అందిస్తుందని ఏపీఎంఐపీ ఏపీడీ ఫిరోజ్‌ఖాన్ అన్నారు. బుధవారం ఆయన కూడేరు, ఇప్పేరులోని రైతు సేవాకేంద్రాలను సందర్శించారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న రైతుల పొలాల్లో బోరు వద్ద ఫొటోలు తీసి అప్‌లోడ్ (పీఏఆర్) చేసే అంశంలో చోటు చేసుకున్న జాప్యంపై సిబ్బందితో సమీక్షించారు. మార్చిలోపు అన్నింటినీ పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కూడేరు మండల వ్యాప్తంగా ఇంకా 405 మంది రైతుల పొలాల్లో ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయడం, జియో టాగింగ్ చేయడం ఉన్నాయన్నారు.రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు అందుబాటులో ఉండి సిబ్బందికి సహకరిస్తే ఈ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ హార్టికల్చర్ ఆఫీసర్ నెట్టికంటయ్య, వీహెచ్‌ఏ సాజియా, ఎంపీఈఓ జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం
పెద్దవడుగూరు: మండలంలోని అప్పేచర్లలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై స్థానిక టీడీపీ నేతలు హత్యాయత్నం చేశారు. పోలీసులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన టీడీపీ నేత ప్రకాష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ కార్యకర్త విజయభాస్కరరెడ్డి మధ్య కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్న వెంచర్‌లో విజయభాస్కరరెడ్డి పని చేస్తుండగా అక్కడికి టీడీపీ నేతలు ప్రకాష్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి చేరుకుని వాగ్వాదానికి దిగారు. మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండడాన్ని గమనించిన విజయభాస్కరరెడ్డి అక్కడి నుంచి ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా అడ్డుకుని వేట కొడవలి, ఇనుప పైపులతో దాడి చేశారు. ఘటనలో విజయభాస్కరరెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డుకోబోయిన ఆయన తమ్ముడు రామ్మోహన్‌రెడ్డిపై సైతం టీడీపీ నేతలు దాడిచేయడంతో ఆయన కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళితే.. దాడికి పాల్పడిన వారు సైతం అక్కడకు చేరుకుని ప్రతిగా ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
అన్ని సౌకర్యాలుంటేనే సబ్సిడీ పరికరాలు
Comments
Please login to add a commentAdd a comment