1962 హెల్ప్‌లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్
అనంతపురం అగ్రికల్చర్: దేశంలోనే తొలిసారిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు ప్రవేశపెట్టారు. పేదలకు ఎంతో సాంత్వన చేకూర్చారు. తండ్రి స్ఫూర్తితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూగ జీవాల కోసం సైతం మొబైల్ అంబులెన్స్‌లు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్సులు మంచి ఫలితాలు ఇవ్వడంతో నియోజకవర్గాలకు అదనంగా మరొకటి సమకూర్చారు. నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే మందులు సైతం ఉచితంగా అందించారు.అర్హత కలిగిన పశువైద్యులు, ఒక పారా వెట్, పైలెట్ కింద డ్రైవర్‌ను నియమించారు. 1962 టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఫోన్ రాగానే 108 మాదిరిగానే మారుమూల ప్రాంతాలకు వెళ్లి రైతు ఇంటి వద్దే మూగజీవాలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మూగజీవాలు మరీ ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ ద్వారానే సమీప పశువుల ఆస్పత్రికి తీసుకువచ్చి పశుసంవర్ధక శాఖ డాక్టర్లు, ఏడీల సహకారంతో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి ప్రాణం పోశారు.
కక్ష గట్టి నిలిపివేత..
ఉన్నతాశయంతో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1962 అంబులెన్స్‌లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కాంట్రాక్టు ముగిసిందనే నెపంతో 14 అంబులెన్స్‌లను ఈనెల 16 నుంచి నిలిపివేసింది. మరికొన్ని రోజుల్లో మిగిలిన అంబులెన్స్‌లు కూడా నిలిచిపోనున్నట్లు తెలిసింది. ఉన్నపళంగా 1962 అంబులెన్స్ సేవలను నిలిపివేయడంపై రైతులు, కాపర్లు మండిపడుతున్నారు. మూగజీవాల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని వాపోతున్నారు. మరోపక్క 1962 అంబులెన్స్‌ల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది పరిస్థితి కూడా అగమ్యగోచరంగా మారింది. కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు వాపోతున్నారు. తమకు రావాల్సిన బకాయిల సంగతి కూడా తేల్చకుండానే కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆందోళన చెందుతున్నారు.
1962 అంబులెన్సులపై
కూటమి సర్కారు కక్ష
ఉమ్మడి జిల్లాలో 14 మొబైల్ అంబులెన్స్‌ల నిలిపివేత
108 మాదిరిగా పశువుల కోసం అంబులెన్స్‌లు తెచ్చిన జగన్ సర్కారు
మారుమూల ప్రాంతాల్లో సైతం
విశిష్ట సేవలు అందించేలా చర్యలు
చంద్రబాబు ప్రభుత్వ తీరుపై పాడి రైతుల ఆగ్రహం
1962 హెల్ప్‌లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్
1962 హెల్ప్‌లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్
Comments
Please login to add a commentAdd a comment