ఆత్మ విశ్వాసం కోల్పోకుండా సాధన చేస్తే సాధించలేనిది ఏదీ
జాతీయ స్థాయి పుట్‌బాల్ పోటీలకు ఎంపికై న క్రీడాకారులు
మాది వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్న ఎంతో పట్టుదలతో నన్ను చదివిస్తున్నారు. వారి కష్టం వృధా కాకుండా చదువుతో పాటు క్రీడల్లోనూ నేను రాణిస్తున్నా. క్రీడా కోటా కింద ప్రభుత్వ ఉద్యోగం సాధించి వారి కష్టాలను తీరుస్తా.
– శ్వేత, 7వ తరగతి,
జెడ్పీహెచ్‌ఎస్, ఆత్మకూరు
ఆత్మకూరు : స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విష్ణుప్రణవి, అస్మిత, వ్వేత, రియాన్షిక సాయి, కీర్తిలక్ష్మి.. ఫుట్‌బాల్ క్రీడలో రాణిస్తున్నారు. ఇప్పటకే ఈ పాఠశాలలో చదివిన మందల అనూష భారత మహిళా పుట్‌బాల్ జట్టుకు ఎంపికై న విషయం తెలిసిందే. అదే బాటలో మరికొందరు పయనిస్తూ మరికొందరు ఆత్మకూరు ఖ్యాతిని జాతీయ స్థాయిలో రెపరెపలాడించనున్నారు.
సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి...
జాతీయ స్థాయిలో ప్రాతినిథ్యం వహించే ఏపీ జట్టులో చోటు దక్కించుకున్న విష్ణుప్రణవి, అస్మిత, వ్వేత, రియాన్షిక సాయి, కీర్తిలక్ష్మి.. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే కావడం విశేషం. చిన్నప్పటి నుంచి ఫుట్‌బాల్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న వారు నిరంతర సాధనతో తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రోజూ ఉదయం, సాయంత్రం క్రమం తప్పని సాధన వారిని ఫుట్‌బాల్ క్రీడలో మెరికలుగా మార్చేసింది. ప్రతిభకు పేదరికం అడ్డురాదని... అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఏడాది జనవరి 27 నుంచి ఈ నెల 10వ తేదీ వరకు అనంతపురంలోని ఆర్డీటీ స్పోర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి పుట్‌బాల్ పోటీలు అండర్ –13 విభాగంలో పాల్గొని తమ సత్తాను నిరూపించుకుని జాతీయ స్థాయికి ఎంపికయ్యారు.
గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన ఆత్మకూరు బాలికలు
అందరూ సాధారణ రైతు కుటుంబాలకు చెందిన వారే
ఆత్మ విశ్వాసం కోల్పోకుండా సాధన చేస్తే సాధించలేనిది ఏదీ
Comments
Please login to add a commentAdd a comment