అనంతపురం: చిట్స్ పేరిట డబ్బు వసూలు చేసి.. తిరిగి సభ్యులకు చెల్లించకుండా తాత్సారం చేసిన నిర్వాహకుల ఆస్తులను అటాచ్ చేశారు. నగరానికి చెందిన నజీర్ బాషా, జరీనా, దాదు అఫ్రిది, మహమ్మద్ రఫీ ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరు చిట్స్ పేరుతో 108 మంది నుంచి రూ.8 కోట్లకు పైగా నగదు వసూలు చేశారు. నిర్దేశిత కాలం పూర్తయినా సభ్యులకు తిరిగి చెల్లించలేదు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో చిట్స్ నిర్వాహకులపై కేసు నమోదైంది. కలెక్టర్, ఎస్పీ నివేదిక ఆధారంగా నిర్వాహకుల ఆస్తులను అటాచ్ చేయాలని జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. నజీర్ బాషా కుటుంబ సభ్యుల ఆస్తులన్నీ అటాచ్ చేశారు. తదుపరి ఉత్తర్వులొచ్చే వరకు ఆస్తి అమ్మకం, నగదు లావాదేవీలు జరపడానికి వీల్లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment