వైభవంగా ధ్వజారోహణం
బుగ్గలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
తాడిపత్రి రూరల్: పట్టణంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం బుగ్గరామలింగేశ్వరస్వామి దేవాలయంలో శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో మహా శివరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నందీశ్వరుని చిత్ర పటానికి అర్చకులు ప్రత్యేక పూజలు చేసి.. ఎగురవేశారు. అంతకు మునుపు బుగ్గరామలింగేశ్వర స్వామి మూలవిరాట్‌కు అగ్ని నివేదన చేశారు. అక్కడి నుంచి అగ్నిని ఊరేగింపుగా హోమశాలకు తీసుకువచ్చారు. అక్కడ సంప్రదాయ పద్ధతిలో పూజలు చేశారు. ఉదయం గణపతి పూజ, అగ్ని మదనం, వాస్తు బలి తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వర స్వామిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. స్వామి, అమ్మవార్లను భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
వైభవంగా ధ్వజారోహణం
Comments
Please login to add a commentAdd a comment