యువత ‘మత్తు’ బారిన పడకూడదు
అనంతపురం అర్బన్: యువత మత్తుబారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎస్పీ జగదీష్‌తో కలిసి ఎన్‌సీఓఆర్‌డీ జిల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న సామాజిక మాధ్యమ గ్రూపుల్లో ప్రభుత్వ పథకాలు, మాదక ద్రవ్యాల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు తదితర అంశాలపై సమాచారం ఉంటుదన్నారు. ఈ గ్రూపుల్లో అధికారులు భాగస్వాములై సమాచారాన్ని ఆయా శాఖలకు చెందిన లబ్ధిదారులకు చేరవేసి అవగాహన కల్పించాలని ఆదేశించారు. నాశ్‌ముక్త్ భారత్ అభియాన్ కింద జిల్లా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డీ– అడిక్షన్ వార్డులో ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. వసతి గృహాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని రెండు వారాల్లోగా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌ఓ ఎ.మలోల, ఆర్డీఓ కేశవనాయుడు, డీటీ వీర్రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాలోని మోడల్ స్కూళ్లలో 2025–26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతి ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రసాద్‌బాబు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 24 నుంచి మార్చి 31 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. 5వ తరగతి స్థాయిలో తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు మోడల్ స్కూళ్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment