పకడ్బందీగా గ్రూప్–2 మెయిన్స్
అనంతపురం అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) ఆధ్వర్యంలో ఈ నెల 23న గ్రూప్–2 మెయిన్స్ రాత పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని పరీక్షల కో–ఆర్డినేటింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై జేసీ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో డీఆర్‌ఓ ఎ.మలోల, ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్ సెక్రెటరీ ఎస్‌ఎన్ షరీఫ్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం సెషన్లుగా జరగనున్న పరీక్షలకు 7,293 మంది అభ్యర్థులు హాజరు కానున్నాన్నారు. పరీక్ష నిర్వహణలో ఏపీపీఎస్‌సీ నిబంధనలు తప్పక పాటించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని జేసీ శివ్ నారాయణ్ శర్మ సూచించారు. ఉదయం పరీక్షకు 9.45 గంటల తరువాత, మధ్యాహ్నం జరిగే పరీక్షకు 2.45 గంటల తరువాత కేంద్రంలోకి అనుమతించబోరన్నారు.
జేసీ శివ్ నారాయణ్ శర్మ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment