పెట్రోల్ బంకుల్లో మోసం.. తనిఖీల్లో బట్టబయలు
అనంతపురం: నగర శివారున సోములదొడ్డి వద్ద ఉన్న విజయలక్ష్మి (ఇండియన్) పెట్రోల్ బంక్‌లో చిప్ అమర్చి మీటర్ రీడింగ్‌ను ట్యాంపరింగ్ చేస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. శుక్రవారం చేపట్టిన తనిఖీల్లో చిప్‌ను విజిలెన్స్ అధికారులు పసిగట్టారు. ఏడాదిలో 28 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకం జరగగా, ఇందులో 2.80 లక్షల లీటర్ల సొమ్మును స్వాహా చేసినట్లుగా గుర్తించారు. ఇలాంటి చిప్ తరహాలోనే జిల్లాలో మరిన్ని పెట్రోల్ బంకుల్లో మోసాలు జరుగుతున్నాయని, అన్నింటిపై విస్తృత తనిఖీలు చేపట్టి అక్రమాలను అడ్డుకుంటామని విజిలెన్స్ డీఎస్పీ నాగభూషణం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment