సేవలతో ప్రజా మన్ననలు పొందాలి
అనంతపురం మెడికల్: ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆవరణంలో 2కే19 బ్యాచ్ స్నాతకోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ వినోద్‌కుమార్ హాజరై ముందుగా జ్యోతిప్రజ్వలన గావించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు యువత ముందుకురావాలన్నారు. తాను వైద్యునిగా గ్రామీణ ప్రాంతాల్లో అందించిన సేవలు, కలెక్టర్‌గా సాధించిన విజయాలను పంచుకున్నారు. ఐఏఎస్ సాధించాలన్న ఆశ ఎవరికై నా ఉంటే ఇష్టంతో చదవాలని సూచించారు. ప్రజలకు విలువలతో కూడిన వైద్యం అందించడం ముఖ్యమన్నారు. గురువులు, తల్లిదండ్రులను గౌరవించాలన్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాణిక్య రావు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అనంతపురం వైద్య కళాశాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. చాలా మంది ఇక్కడ విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు మెమొంటోలు, పట్టాలను కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ డాక్టర్ కేఎస్‌ఎస్ వెంకటేశ్వర రావు, వైస్ ప్రిన్సిపాళ్లు డాక్టర్ షంషాద్‌బేగం, డాక్టర్ షారోన్ సోనియా తదితరులు పాల్గొన్నారు.
వైద్య విద్యార్థులకు
కలెక్టర్ వినోద్‌కుమార్ పిలుపు
ఘనంగా అనంతపురం వైద్య కళాశాల 2కే 19 బ్యాచ్ స్నాతకోత్సవం
సేవలతో ప్రజా మన్ననలు పొందాలి
Comments
Please login to add a commentAdd a comment