శేషవాహనంపై చెన్నకేశవుడు
పెద్దవడుగూరు(యాడికి): మండల కేంద్రమైన యాడికిలో వెలసిన లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం దేవేరులతో కలసి శేషవాహనంపై శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో విశేష పూజలు పెద్ద ఎత్తున జరిగాయి. రాత్రి 10 గంటలకు శేష వాహన సేవలను నేత్రపర్వంగా నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
12న జాబ్ మేళా
గుంతకల్లు రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఆధ్వర్యంలో గుంతకల్లులోని న్యాక్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ నెల 12న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు న్యాక్ ఏడీ గోవిందరాజులు, డీఎస్‌డీఓ ప్రతాప్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి, 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగ యువతీయువకులు అర్హులు. టాటా క్యాపిటల్, సింధూజ మైక్రో క్రెడిట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు హాజరై ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి ఉన్న వారు ధ్రువీకరణ పత్రాలతో జాబ్‌మేళాకు హాజరు కావచ్చు.
యువకుడి దుర్మరణం
ఉరవకొండ: స్ధానిక అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఉరవకొండలోని ఇంద్రా నగర్‌కు చెందిన కార్తీక్ (18), నందకుమార్ సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై వెళుతూ వేగాన్ని నియంత్రించుకోలేక డివైడర్‌ను ఢీకొన్నారు. ఘటనలో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన నందకుమార్‌ను స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై సీఐ మహనంది కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గుర్తు తెలియని
యువకుడి ఆత్మహత్య
గుంతకల్లు: స్థానిక తిమ్మనచర్ల రైలు మార్గంలో 440/29 కి.మీ. వద్ద పట్టాలపై ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించారు. సమాచారం అందుకున్న జీఆర్‌పీ ఎస్‌ఐ మహేంద్ర అక్కడకు చేరుకుని పరిశీలించారు. దాదాపు 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఆచూకీ తెలిసిన వారు 98661 44616కు ఫోన్ చేసి సమాచారం అందించాలని రైల్వే పోలీసులు కోరారు.
శేషవాహనంపై చెన్నకేశవుడు
శేషవాహనంపై చెన్నకేశవుడు
Comments
Please login to add a commentAdd a comment