కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేదలకు కష్టాలు ఒకదాన
అనంతపురం మారుతీనగర్‌లో రేషన్ సరుకుల కోసం క్యూలో నిల్చున్న కార్డుదారులు (ఫైల్)
అనంతపురం అర్బన్: జిల్లావ్యాప్తంగా 6,60,330 బియ్యం కార్డులు ఉన్నాయి. కార్డులోని ఒక్కో సభ్యునికి ప్రతి నెలా 5 కిలోల చొప్పున బియ్యం, కార్డుకు అరకిలో చెక్కర, కిలో కందిపప్పు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అయితే, మార్చి నెలకు సంబంధించి కందిపప్పు కోటా 625 టన్నులను ప్రభుత్వం సరఫరా చేయలేదు. కార్డుదారులకు కేవలం బియ్యం, చక్కెర పంపిణీతో సరిపెడుతున్నారు. గత రెండు నెలలు కూడా కందిపప్పు సక్రమంగా పంపిణీ చేయలేదని కార్డుదారులు ఆరోపిస్తున్నారు. ఇక అరకొర సరుకులు తీసుకునేందుకూ చౌక దుకాణాల వద్ద బారులు తీరి గంటల పాటు పడిగాపులు పడాల్సిన దుస్థితి నెలకొనడంతో కార్డుదారులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
బియ్యం నొక్కుడు
కొందరు డీలర్లు కార్డుదారులకు ఇవ్వాల్సిన కోటా నుంచి బియ్యం నొక్కేస్తున్నారు. కార్డుకు మూడు కిలోల బియ్యం బదులు జొన్నలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిసింది. కార్డుదారులు జొన్నలు తీసుకున్నా... తీసుకోకపోయినా బియ్యం మాత్రం మూడు కిలోలు ఇవ్వడం లేదని సమాచారం. ఇలా మిగుల్చుకున్న బియాన్ని బ్లాక్ మార్కెటింగ్ చేసే వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది.
షాపుల వద్ద బారులు
ఒక ఎండీయూ (బియ్యం పంపిణీ వాహనం) నిర్వాహకుని వద్ద ఈ–పాస్ యంత్రం ఉంటుంది. ఎండీయూ పరిధిలో మూడు నుంచి నాలుగు స్టోర్లు వస్తాయి. దీంతో అన్ని స్టోర్లలో ఒకేసారి సరుకుల పంపిణీకి వీలుకపోవడంతో మూడు రోజులు ఒక స్టోర్ వద్ద ఈ–పాస్ యంత్రం పెట్టుకుని దాని డీలర్ ద్వారా రేషన్ ఇస్తున్నాడు. అటు తరువాత మరో స్టోర్ వద్ద, ఇలా మూడు రోజులకు ఒక స్టోర్ వద్ద సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్డుదారులు తెరిచిన స్టోర్ వద్దకు పెద్దసంఖ్యలో చేరుకుని సరుకులు తీసుకునేందుకు బారులు తీరుతూ పడిగాపులు కాస్తున్నారు.
అమలు కాని విధానం
ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు కార్డుదారులకు సరుకులు ఇవ్వాలి. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సరుకులు పంపిణీ చేయాలి. స్టోర్ డీలర్ రిజిస్టర్ నిర్వహించాలి. అయితే జిల్లాలో ఈ విధానం అమలు కావడం లేదు. ప్రతి రేషన్ షాపు డీలర్‌కు ఒక ఈ–పాస్ యంత్రాన్ని ప్రభుత్వం ఇవ్వకపోవడంతో సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులు ఇబ్బందిపడాల్సి వస్తోంది.
1,645
జిల్లాలో చౌకదుకాణాలు
ఏఏవై కార్డులు
52,371
పురుషులు
9,71,251
మహిళలు
9,80,503
కందిపప్పు కోటా సరఫరా చేయని
చంద్రబాబు ప్రభుత్వం
బియ్యం, చక్కెరతో సరిపెడుతున్న వైనం
అరకొర సరుకులు తీసుకునేందుకూ పేదల పడిగాపులు
ప్రభుత్వ తీరుపై మండిపాటు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేదలకు కష్టాలు ఒకదాన
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేదలకు కష్టాలు ఒకదాన
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేదలకు కష్టాలు ఒకదాన
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి పేదలకు కష్టాలు ఒకదాన
Comments
Please login to add a commentAdd a comment