No Headline
అమ్మాయిల చదువులకు తోడ్పాటు అందించడం, సామాజిక సేవాకార్యకర్తగా పర్యావరణ కార్యక్రమాలు, చిన్నారుల సృజనను ప్రోత్సహించడం, విద్యాలక్ష్యాలను చేరుకోవడం కోసం నిత్యం పరితపిస్తుంటారు ఏజీ ప్రమీలారెడ్డి. వయసు ఎనిమిది పదులు దాటినా నేటికీ చురుగ్గా సమాజహితం కోసం పాటుపడుతుంటారు. క్షామపీడిత అనంత సస్యశ్యామలం కావడం కోసం విరివిగా మొక్కల పంపిణీ, పక్షులకు కృత్రిమ గూళ్ల ఏర్పాటుకు సహకరిస్తున్నారు. ముఖ్యంగా కరోనాపై పోరాట మహాయజ్ఞంలో ఏజీఎస్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆమె చూపిన చొరవ, ‘హీల్ అనంతపురం’ పేరుతో అందించిన సేవలు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చాయి. నిరాశ్రయులకు, అనాథలకు, ఆశ్రమాల్లోని వృద్ధుల జీవితాల్లో వెలుగులు నింపడానికి వాహనాల ద్వారా ఆహార పొట్లాలు అందిస్తున్నారు. – అనంతపురం కల్చరల్:
సేవకు ప్రతిరూపం ప్రమీల
Comments
Please login to add a commentAdd a comment