ఉత్సాహంగా ఉట్ల పరుష
రాప్తాడు: అయ్యవారిపల్లిలో ఎర్రిస్వామి తాత ఉట్లపరుషను శనివారం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయంలో వినాయకుడు, శ్రీరాముడు, ఎర్రిస్వామి తాత, గోటుకూరుప్ప స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం అయ్యవారిపల్లి, బోమ్మేపర్తి, బుక్కచెర్ల, కాటిగానికాలువ గ్రామాలకు చెందిన యాదవ కులస్తులు ఉట్టికొట్టారు. ఈ దృశ్యాన్ని వేలాది మంది తిలకించారు. ఆలయం వద్ద బుల్లే పెద్దఇటుకనల్లప్ప, బండి పెదయ్య, బుల్లే వెంకటరాముడు, బుల్లే రాంభూపాల్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తాదులకు ఎటువంటి అసౌకార్యాలు కలగకుండా కాల్వగొంచి నిర్వాహకులు, గ్రామస్తులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాప్తాడు సీఐ శ్రీహర్ష ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉత్సాహంగా ఉట్ల పరుష
Comments
Please login to add a commentAdd a comment