యువతపోరు విజయంతం చేద్దాం
బెళుగుప్ప: నిరుద్యోగ యువత, విద్యార్థుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 12న వైఎస్సార్‌సీపీ తలపెట్టిన యువతపోరు కార్యక్రమాన్ని విజయంతం చేద్దామంటూ ఆ పార్టీ ఉరవకొండ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. బెళుగుప్ప మండలం కాలువపల్లిలో వైఎస్సార్‌సీపీ మండల బీసీసెల్ అధ్యక్షుడు వెంకటేశులు స్వగృహంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మొండి చెయ్యి చూపిందన్నారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పేరుతో ఒక్కొక్కరికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీకి దిక్కు లేదన్నారు. ఇలాంటి మోసాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఈ నెల 12న కలెక్టరేట్ ఎదుట తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు పాల్గొనాలని కోరారు.
కుప్పంకు నీటిని తరలించేందుకే
హంద్రీనీవా లైనింగ్ పనులు..
కేవలం కుప్పం ప్రాంతానికి నీటిని తరలించాలనే లక్ష్యంతో జిల్లా రైతుల ఆశలకు శాశ్వతంగా సమాధి కడుతూ హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని విశ్వ మండిపడ్డారు. జిల్లా రైతుల సంక్షేమాన్ని సీఎం చంద్రబాబు పూర్తి విస్మరించారన్నారు. లైనింగ్ పనులు పూర్తయితే భూగ్బజలాలు అడుగంటి ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతింటాయన్నారు. తక్షణమే లైనింగ్ పనులు ఆపడమే కాక జిల్లాలోని 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. హంద్రీనీవా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టే ప్రతి కార్యక్రమానికీ పార్టీలకు అతీతంగా రైతులందరూ బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ సెల్ అధికార ప్రతినిధి వీరన్న, సర్పంచ్ పెద్దన్న, డీసీసీబీ మాజీ డైరెక్టర్ శివలింగప్ప, అంకంపల్లి సర్పంచ్ రుద్రానంద, మాజీ సర్పంచ్ తిమ్మన్న, పార్టీ సీనియర్ నాయకులు మోహన్, శ్రీనివాసరెడ్డి, చందూ, కృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, తిప్పేస్వామి, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment