ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
● కుంటలో ఈతకెళ్లి ఇద్దరు బాలుర మృతి
హిందూపురం: ఈత సరదా ఇద్దరు చిన్నారులను బలిగొంది. వివరాలు... హిందూపురం సమీపంలోని అటోనగర్‌లో నివాసముంటున్న జహీర్ కుమారుడు రిహాన్ (14), సుహేల్, ఉమేరా దంపతుల కుమారుడు అయాన్ (12) స్థానిక పాఠశాలలో 7, 6 తరగతులు చదువుకుంటున్నారు. ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో తోటి స్నేహితులతో కలసి సమీపంలోని నీటి కుంటలో ఈత కొట్టేందుకు వెళ్లారు. లోతైన ప్రాంతానికి వెళ్లడంతో నీట మునిగిపోయారు. పిల్లల కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకుని నీట మునిగిన ఇద్దరినీ వెలికి తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఇద్దరినీ వెంటనే స్థానిక ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. చికిత్సకు స్పందించిక రిహాన్, అయాన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆటో నగర్ వాసులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారుల మృతదేహాలను చూడగానే కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. ఘటనపై రెండో పట్టణ పీఎస్ సీఐ అబ్దుల్ కరీం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బీటెక్ విద్యార్థిని అదృశ్యం
ధర్మవరం అర్బన్: స్థానిక రామనగర్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థిని కనిపించడం లేదు. అనంతపురం శివారులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆమె శనివారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. విద్యార్థిని తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టినట్లు రెండో పట్టణ పీఎస్ సీఐ రెడ్డప్ప తెలిపారు.
ప్రాణాలు బలిగొన్న ఈత సరదా
Comments
Please login to add a commentAdd a comment