పరీక్షలు ముగిశాయ్.. ఇక ఎంజాయ్
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 1న ప్రారంభమైన ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. చివరి రోజు జరిగిన కెమిస్ట్రీ పేపర్–1, కామర్స్ పేపర్–1, సోషియాలజీ పేపర్–1, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్ పేపర్–1 పరీక్షలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరయ్యారు. మైనర్ సబ్జెక్టుల పరీక్షలు ఈనెల 17, 19న ఉంటాయి. ఇక.. చివరిరోజు పరీక్షకు 806 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 24,159 మందికి గాను 23,489 మంది హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 1,878 మందికి గాను 1,742 మంది హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ కన్వీనర్ వెంకటరమణనాయక్ 4, కమిటీ సభ్యులు 5, సిట్టింగ్ స్క్వాడ్ సభ్యులు 10, ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు 14, కస్టోడియన్లు 11 పరీక్ష కేంద్రాలను పరిశీలించారు.
సందడే సందడి
పరీక్షలు ముగిసిన అనంతరం విద్యార్థులు సందడి సందడి చేశారు. చాలారోజులుగా జిల్లా కేంద్రంలో అద్దె గదులు, రెసిడెన్షియల్ కళాశాలలు, హాస్టళ్లల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు పరీక్షలు పూర్తవగానే కేంద్రాల వద్ద సంతోషంగా గడిపారు. ఒకరికొకరు సెండాఫ్ చెప్పుకున్నారు. లగేజీలతో సొంతూళ్లకు వెళ్లారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలను తమ వెంట పిలుచుకెళ్లారు. ఆర్టీసీ బస్టాండు కిటకిటలాడింది.
పరీక్షలు ముగిశాయ్.. ఇక ఎంజాయ్
Comments
Please login to add a commentAdd a comment