వైఎస్సార్‌సీపీ నేత వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి
బ్రహ్మసముద్రం: వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ వాహనంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. బాధితులు తెలిపిన వివరాలు..పాలవెంకటాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ పాలబండ్ల చంద్రశేఖరరెడ్డి కుటుంబ సభ్యులు నటరాజ్ , ప్రశాంత్ అదే గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త భీం రాజ్‌తో కలిసి కర్ణాటకలోని మొలకాల్మూరు కోర్టుకు హాజరై బొలెరో వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. వేపులపర్తి గ్రామంలో మద్యం దుకాణం వద్దకు రాగానే పూటుగా మద్యం సేవించిన టీడీపీ కార్యకర్తలు వినాయక్, గొల్ల శివ వాహనంపై రాళ్లతో దాడి చేశారు. దాడిలో వాహన అద్దం ధ్వంసమైంది. ఘటనపై బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రిజ్వాన్
● మరికొందరికి రాష్ట్ర కమిటీలో చోటు
అనంతపురం కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాగజ్‌ఘర్ రిజ్వాన్‌ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. రిజ్వాన్ గతంలో వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్‌గా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా షేక్ రహ్మంతుల్లా, దాండియా ఖాజామైనుద్దీన్, ఎస్ తబ్రిజ్ షోకత్ హామి, వీ అబుజార్ నదీం అహ్మద్, రాష్ట్ర సహాయ కార్యదర్శిగా షేక్ అఫ్జల్, రాష్ట్ర అధికార ప్రతినిధిగా షేక్ నియాజ్ అహ్మద్, రాష్ట్ర ఐటీ వింగ్ జోనల్ అధ్యక్షుడిగా పీ మంజునాథ్ యాదవ్ నియమితులయ్యారు.
పావురం గుడ్ల కోసం వెళ్లి..
● బావిలో పడి చిన్నారి మృతి
రాప్తాడు: పావురం గుడ్ల కోసం వెళ్లిన చిన్నారి బావిలో పడి మృతి చెందిన ఘటన భోగినేపల్లిలో చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన పామాల లక్ష్మి ఏకై క కుమారుడు పామాల పునీత్‌కుమార్ (8) శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం తగరకుంట గ్రామంలో ప్రైవేటు పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. హోలీ సందర్భంగా శుక్రవారం పాఠశాలకు సెలవు కావడంతో స్నేహితులతో కలిసి గ్రామ సమీపంలోని పాడు బడిన బావి వద్దకు వెళ్లారు. బావిలోని రంధ్రాల్లో ఉన్న పావురాల గుడ్ల వెతుకుతుండగా పునీత్‌కుమార్ కాలుజారి బావిలో పడిపోయాడు. చిన్నారి స్నేహితులు వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించగా వెంటనే వారు అక్కడికి చేరుకుని వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు 3 గంటల పాటు శ్రమించి చిన్నారి మృతదేహాన్ని బయటకు తీశారు. చిన్నారి మృతదేహంపై పడి చిన్నారి తల్లి రోదించిన తీరు పలువురి కంట నీరు తెప్పించింది. ఇదిలా ఉండగా మూడేళ్ల క్రితం చిన్నారి తండ్రి నారాయణస్వామి రైలు ప్రమాదంలో మృతి చెందాడు.
వైఎస్సార్‌సీపీ నేత వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి
వైఎస్సార్‌సీపీ నేత వాహనంపై టీడీపీ కార్యకర్తల దాడి
Comments
Please login to add a commentAdd a comment