
కమిషన్ గురించి తెలుసుకోవాలి
మేము 30 ఏళ్లుగా వినియోగదారుల సమస్యలపై పోరాడుతున్నాం. సమాజంలో ఎన్ని రకాలుగా మోసపోతున్నామో అవగాహన కల్పిస్తున్నాం. వినియోగదారులు చైతన్యవంతులుగా మారి.. ప్రశ్నించే తత్వం అలవరచుకోవాలి. వినియోగదారులు పొందాల్సిన వస్తు సేవల్లో నాణ్యత లేకపోయినా చూసీచూడనట్టు వదిలేయడం వల్లే సమాజంలో నానాటికీ మోసాలు మరింత పెరుగుతున్నాయి. కార్మిక న్యాయస్థానాలు, వినియోగదారుల కమిషన్ గురించి అవగాహన ఉండాలి. అప్పుడే వ్యాపారుల్లోనూ, అధికారుల్లోనూ చలనం ఉంటుంది. చట్టం గురించి తెలుసుకున్న వారు ఎన్నో విజయాలను సాధించారు.
– చల్లా కిషోర్, వినియోదారుల సంఘం రాష్ట్ర సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment