అనంతలో పరిశ్రమల స్థాపనకు కృషి
● పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
తాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లా పరిశ్రమల స్థాపనకు అనుకూలమని, ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం ఆయన తాడిపత్రిలో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి స్వగృహానికి వెళ్లిన ఆయన మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డితో కాసేపు ముచ్చటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో విస్తారంగా గనులు ఉన్న కారణంగా లభ్యమయ్యే ముడిసరుకు ఆధారిత పరిశ్రమలు జిల్లాకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆజాద్‌గ్రూప్, సోలార్ సంబంధిత ప్రాజెక్ట్‌లు క్లియర్ అయ్యాయన్నారు. ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్వీడ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌కు ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
దానిమ్మ తోట దగ్ధం
రాయదుర్గంటౌన్: జుంజురాంపల్లిలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో దానిమ్మ చెట్లు, డ్రిప్ పరికరాలు దగ్ధమయ్యాయి. బాధిత రైతు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన రైతు మఠం తిప్పేస్వామి నాలుగెకరాల్లో దానిమ్మ సాగు చేశాడు. విద్యుత్ ప్రధాన తీగలు షార్ట్‌సర్క్యూట్ జరిగి నిప్పులు కిందున్న ఎండుగడ్డిపై పడటంతో మంటలు చెలరేగి పొలమంతా వ్యాపించాయి. దీంతో దానిమ్మ చెట్లు, డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. ఘటనలో రూ.8 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు వాపోయాడు.
టీకాలతో గాలికుంటు నివారణ
శింగనమల: పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ రమేష్‌రెడ్డి తెలిపారు. మండలంలోని గుమ్మేపల్లిలో శుక్రవారం పశువైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి ఒక పశువు నుంచి మరో పశువుకు త్వరగా వ్యాపిస్తుందన్నారు. పాడి పశువులు వ్యాధి సోకితే పాల ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. గాలికుంటు నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పశువైద్యాధికారి మల్లిక, సిబ్బంది పాల్గొన్నారు.
అనంతలో పరిశ్రమల స్థాపనకు కృషి
అనంతలో పరిశ్రమల స్థాపనకు కృషి
Comments
Please login to add a commentAdd a comment