
వైభవంగా శివలక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం
పెద్దవడుగూరు(యాడికి): యాడికిలోని శివలక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శివలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించి వేదమంత్రోచ్ఛారణల నడుమ కల్యాణం జరిపించారు. వివిధ పార్టీల నాయకులు, వేలాది మంది భక్తులు స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శివలక్ష్మీ చెన్నకేశవస్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంరించిన రథంపై ఉంచి పూజలు నిర్వహించారు. వేలాది భక్తుల చెన్నకేశవస్వామి నామస్మరణతో రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఆర్యవైశ్య వాసవీ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో వైఎస్సార్‌సీపీ నాయకులు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భక్తులకు స్వామి లడ్డూ, చిత్రపటాలను పంపిణీ చేశారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున తినుబండారాలు, ఆటబొమ్మలు, వివిధ రకాల దుకాణాలు వెలియడంతో యాడికిలో సందడి నెలకొంది. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రతాప్‌రెడ్డి, ఆలయ ఈఓ దుర్గప్రసాద్, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
వేలాది మంది భక్తుల నడుమ సాగుతున్న రథోత్సవం

వైభవంగా శివలక్ష్మీ చెన్నకేశవస్వామి రథోత్సవం
Comments
Please login to add a commentAdd a comment