మద్యం మత్తులో యువకుడి మృతి
కంబదూరు: మండల కేంద్రంలో ఓ యువకుడు మద్యం మత్తులో వరి మడిలోకి జారిపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కంబదూరుకు చెందిన రామాంజినేయులు, మణెమ్మ దంపతుల కుమారుడైన అజయ్‌కుమార్(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవాడు. పంటలు సరిగా పండకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల ఒత్తిడి తట్టుకోలేక మద్యానికి బానిసయ్యాడు. గురువారం రాత్రి పూటుగా మద్యం సేవించి వరి పంటకు నీళ్లు కట్టేందుకు వెళ్లాడు. ఈ సమయంలో వరి మడిలో జారిపడ్డాడు. అప్పటికే మద్యం మత్తులో ఉండటంతో బురదలో నుంచి పైకి లేవడానికి చేతకాక ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రవీణ్ తెలిపారు. ఇదిలా ఉండగా మృతుడి మొదటి భార్య వదిలేయడంతో మూడు నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు.
చీనీచెట్లు దగ్ధం
ఆత్మకూరు: వడ్డుపల్లిలో రైతు ఓబిరెడ్డికి చెందిన చీనీ చెట్లు అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యాయి. బాధితుడి వివరాల మేరకు..రైతు నాలుగేళ్ల క్రితం 4 ఎకరాల్లో 600 చీనీచెట్లు సాగు చేశాడు. ఇందుకోసం దాదాపు రూ.5 లక్షల దాకా ఖర్చు చేశాడు. ఈ ఏడాది కాపు వదలాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టడంతో మంటలు చెలరేగి చీనీచెట్లు, చింతచెట్లు, డ్రిప్ పరికరాలు కాలిపోయాయి. ప్రభుత్వం తనను ఆదుకోవాలని బాధితుడు కోరారు.
బాలుడిపై దాడి
గుత్తి రూరల్: గార్లదిన్నె మండలం కల్లూరు ఆర్‌ఎస్‌లో ఓ బాలుడిపై శుక్రవారం ఇంటి పక్కన వారు దాడి చేసి గాయపరిచారు. బాధితుడి బంధు వులు తెలిపిన వివరాలు.. కల్లూరు ఆర్‌ఎస్‌కు చెందిన రామాంజనేయులుకు ఇంటి పక్కన వారితో చిన్నపాటి విషయంపై గొడవ జరిగింది. ఈ క్రమంలో మాటామాట పెరిగి రామాంజనేయులుపై ఇంటి పక్కన వారు కర్రలు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. తన తండ్రిని కొడుతున్నారని బాలుడు యహోషువా వెళ్లి అడ్డుపడ్డాడు. దీంతో వారు అతడిపై కూడా విచక్షణా రహితంగా దాడి చేశారు. దాడిలో ఎడమ కాలు విరిగి తీవ్రంగా గాయపడిన బాలుడిని గుత్తిలో ఉన్న బంధువులు వెంటనే కల్లూరు నుంచి గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అతడిని పరీక్షించిన వైద్యులు అనంతపురం రెఫర్ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
మద్యం మత్తులో యువకుడి మృతి
మద్యం మత్తులో యువకుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment