ఆర్డీటీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
ఉరవకొండ: స్థానిక ఆర్డీటీ ఫీల్డ్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ ఉద్యోగి విషద్రావకం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు..పట్టణానికి చెందిన ఎరుకల మల్లికార్జున స్థానిక ఆర్డీటీ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పని చేసేవాడు. శుక్రవారం ఉరవకొండ శివారులో విషద్రావకం తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు అనంతపురం తీసుకెళ్లారు. బాధితుడి నుంచి పోలీసులు సూసైట్ నోట్ స్వాధీనం చేసుకున్నారు.
సూసైడ్ నోట్ ఇలా..
‘ఆరేళ్లుగా ఉరవకొండ, గుంతకల్లు ఆర్డీటీ కార్యాలయాల్లో అకౌంటెంట్‌గా పని చేశా. కొంత కాలం క్రితం ఏటీఎల్ గ్రామస్వరాజ్యనిధి చెక్కును ఇచ్చి విత్‌డ్రా చేసుకురావాలని ఆదేశించారు. వారు చెప్పిన విధంగా డ్రా చేసి మొత్తం నగదు వారికి అందించా. ఉరవకొండ, గుంతకల్లు నుంచి బదిలీ అయ్యే సమయంలో రికార్డులన్నీ పరిశీలించి, నా నుంచి ఎలాంటి డ్యూస్ లేవని క్లియరెన్స్ చేసి సీనియర్ అకౌంటెంట్ నాకు రిలీవింగ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే గ్రామ స్వరాజ్య నిధులు తానే స్వాహా చేసినట్లు అధికారులు ఆరోపించి తన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి ఆర్డీటీ ఆఫీసుకు పిలిచి డబ్బు కట్టాలని బెదిరించాడు. డబ్బు మొత్తం ఆర్డీటీ అధికారులకు ఇచ్చా. ఇందులో నా ప్రమేయం లేదు. ఆర్డీటీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నా’ అంటూ లేఖలో పొందుపరిచాడు.
ఉన్నతాధికారుల వేధింపులే కారణమని సూసైడ్ నోట్
ఆర్డీటీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment