ప్రణాళికతో పనిచేస్తేనే ఫలితాలు
● కలెక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్: ప్రణాళికాబద్ధంగా పనిచేస్తేనే క్షేత్రస్థాయిలో కచ్చితమైన ఫలితాలు వస్తాయని కలెక్టర్ వి. వినోద్‌కుమార్ అన్నారు. లక్ష్యాలను అధిగమించే దిశగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని చెప్పారు. మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలు నుంచి పదో తరగతి పరీక్షలు, ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ క్యాంపెయిన్ తదితర అంశాలపై జిల్లా అధికారులు, ఆర్‌డీఓలు, ప్రత్యేక అధికారులు, డీఎల్‌డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు, క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ దారా సమీక్షించారు. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు. ‘స్వర్ణ ఆంధ్ర– స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమాలను ప్రతి నెలా మూడో శనివారం కచ్చితంగా నిర్వహించాలన్నారు. ఎన్నికలకు సంబంధించి ఫారం 6, 7 8 పెండింగ్ లేకుండా పరిష్కరించాలన్నారు. వెనుకబడిన తరగతుల గృహ నిర్మాణ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం గురించి తెలియజేయాలన్నారు. ‘పీఎం జన ఆరోగ్య యోజన’ పెండింగ్ లేకుండా పూర్తి చేయాలన్నారు. సర్వే అంశాలు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్‌ఓ ఎ.మలోల, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డి, డీఈఓ ప్రసాద్‌బాబు, సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పునర్ వ్యవస్థీకరణ పక్కాగా జరగాలి
విద్యార్థుల తల్లిదండ్రుల అభీష్టం మేరకు పాఠశాలల పునర్ వ్యవస్థీకరణ పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సూచించారు. కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రాయదుర్గం నియోజకవర్గ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. పాఠశాలల యాజమాన్య కమిటీల ఆమోదంతో ప్రక్రియ నిర్వహించాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment