
సాంకేతిక పరిజ్ఞానంతో పోటీ పడాలి
బుక్కరాయసముద్రం: శరవేగంగా పరుగులు తీస్తున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇంజినీరింగ్ విద్యార్థులు పోటీ పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్‌ఆర్‌ఐటీ కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి పేర్కొన్నారు. సింఫనీ–2025 పేరుతో శుక్రవారం ఎస్‌ఆర్‌ఐటీ (అటానమస్) వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరెస్పాండెంట్ ఆలూరి సాంబశివారెడ్డి హాజరయ్యారు. శ్రీనివాస రామానుజం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత రోజుల్లో ఇంజనీరింగ్ విద్యకు ఎంతో డిమాండ్ ఉందన్నారు. ప్రతి విద్యార్థికీ మంచి నైపుణ్యాలు కల్పించడంతో పాటు ఉద్యోగం కల్పించే దశగా ఎస్‌ఆర్‌ఐటీ అధ్యాపక బృందం సాగిస్తున్న కృషిని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఐటీ దిగ్గజ కంపెనీల్లో తమ కళాశాల విద్యార్థులు వందలాది మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. అనంతరం కళాశాల వివిధ బ్రాంచ్‌లలో సీనియర్ ప్రొఫెసర్లకు అవార్డులు, మెమెంటోలు, కళాశాల టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు పతకాలను, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ డాక్టర్ రంజిత్‌రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ, ఐక్యూసీ డైరెక్టర్ సాయి చైతన్య కిషోర్ వివిధ విభాగాల అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆలూరి సాంబశివారెడ్డి పిలుపు