
కూటమి కక్ష.. నెరవేరని పేదల కాంక్ష
పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల్లో గృహ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ నిర్మాణాలు పూర్తయితే వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పేదలకు సొంతిల్లు దక్కకుండా చేస్తోంది. దీంతో అసంపూర్తిగా నిలిచిన నిర్మాణాల్లో అల్లరిమూక వికృత చేష్టలకు పాల్పడుతూ విలువైన సామగ్రిని అపహరించుకెళుతోంది. అనంతపురం రూరల్ మండలం కొడిమి లే అవుట్ జగనన్న కాలనీలో ఇలాంటి విధ్వంసాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి ఘటనలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
కొడిమి జగనన్న
కాలనీలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలు
దొంగల పాలవుతున్న కంకర

కూటమి కక్ష.. నెరవేరని పేదల కాంక్ష