
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకు 252 బ్లాక్ ఫంగస్ కేసులను గుర్తించారు. వీటిలో ఇప్పటికే 184 కేసులకు చికిత్స ప్రారంభించినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 60 కేసులు నమోదైనట్టు వెల్లడైంది. అనంతపురంలో 10, చిత్తూరులో 20, కడపలో 18, తూర్పుగోదావరిలో 15, కృష్ణాలో 40, కర్నూలులో 4, నెల్లూరులో 9, ప్రకాశంలో 32, శ్రీకాకుళంలో 7, విశాఖపట్నంలో 33, పశ్చిమగోదావరిలో 4 కేసులు నమోదయ్యాయి.
ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రమే ఇప్పటివరకూ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కాలేదు. బ్లాక్‌ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) చికిత్సకు అవసరమయ్యే యాంపొటెరిసిన్–బి ఇంజక్షన్లను రోగులకు ఇప్పటివరకు 309 ఉపయోగించగా, మరో 575 అందుబాటులో ఉన్నాయి. పొసకొనజోల్ ఇంజక్షన్లు 443, పొసకొనజోల్ మాత్రలు 14,270 అందుబాటులో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment