సాక్షి, అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల్లో 74,422 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 3,746 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7,93,299గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. కరోనా నుంచి కొత్తగా 4,739 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,54,415కు చేరింది.
గత 24 గంటల్లో ఏపీలో 27 మంది కరోనాతో మృత్యువాత పడగా.. మొత్తం మరణాల సంఖ్య 6,508గా ఉంది. ప్రస్తుతం ఏపీలో 32,376 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 72,71,050 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.ఏపీలో ప్రతి మిలియన్ జనాభాకు 1,36,162 పరీక్షలు నిర్వహిస్తుండగా.. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 10.91శాతానికి పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment