దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు | Adimulapu Suresh Lays Foundation Stone For Govt Polytechnic College Building | Sakshi
Sakshi News home page

దేశంలో ఎక్కడా లేని విధంగా.. ‘నాడు-నేడు’కు 11 వేల కోట్లు

Published Tue, Jun 29 2021 2:42 PM | Last Updated on Tue, Jun 29 2021 3:14 PM

Adimulapu Suresh Lays Foundation Stone For Govt Polytechnic College Building - Sakshi

సాక్షి, గుంటూరు: విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తెచ్చామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. మంగళవారం ఆయన క్రోసూరు మండలం విప్పర్లలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నంబూరు శంకర్రావు, అంబటి రాంబాబు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ వివేక్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నారన్నారు. విద్యారంగంపై ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిన ప్రభుత్వం దేశంలోనే లేదని.. విద్యావ్యవస్థలో నాడు-నేడు కింద రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న నాడు-నేడు పనుల్ని తెలంగాణ అధికారులు కూడా వచ్చి పరిశీలించారని, ‘నాడు-నేడు’ను తెలంగాణలో కూడా అమలు చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.

చదవండి: సీఎం జగన్‌ సమక్షంలో ‘దిశ యాప్‌’ లైవ్‌ డెమో
దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement