
సంఘం ప్రతినిధులకు నియామక పత్రాలు అందిస్తున్న మంత్రి వెలంపల్లి, పావులూరి తదితరులు
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ) : రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణులకు తోడుగా ఉంటుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఏపీ విశ్వబ్రాహ్మణ సంఘ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం విజయవాడ కబేళా సమీపంలోని శ్రీకామాక్షి ఏకాంబేశ్వర విశ్వబ్రాహ్మణ కల్యాణ మండపంలో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావులూరి హనుమంతరావుతో పాటు ఉపాధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఈ నెల 9న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి వెలంపల్లి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతినిధులకు నియామక పత్రాలు అందించారు. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, సంఘ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జవ్వాది కూర్మాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయ నిర్మాణానికి పావులూరి రూ.18 లక్షలు, సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహారావు రూ.5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment