డిజిటలైజ్డ్ సీడీవో కార్యక్రమంలో మంత్రి అనిల్
సాక్షి, అమరావతి: దేశంలో అత్యుత్తమ ఆకృతుల సంస్థలో రాష్ట్ర కేంద్ర ఆకృతుల విభాగం (సీడీవో) నిలవడం రాష్ట్రానికే గర్వకారణమని జలవనరులశాఖ మంత్రి పి.అనిల్‌కుమార్‌యాదవ్ చెప్పారు. ఆయన గురువారం విజయవాడలోని సీడీవో కార్యాలయంలో డిజిటలైజ్డ్–సీడీవో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల డిజైన్లను డిజిటలైజ్ చేసే కార్యక్రమాన్ని డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతిష్టాత్మక పోలవరం జాతీయ ప్రాజెక్టు డిజైన్లను సీడీవో పరిశీలించిన తర్వాతే కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు పంపుతారన్నారు.
సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్లలోనూ లోపాలను ఎత్తిచూపి.. వాటిని సరిచేసిన ఘనత సీడీవో అధికారులకు దక్కిందని చెప్పారు. అందుకే దేశంలో అత్యుత్తమంగా డిజైన్లను రూపొందించడంలో సీడబ్ల్యూసీతో సమానంగా సీడీవో నిలిచిందన్నారు. దేశంలో అత్యుత్తమ ఆకృతులను రూపొం దించినందుకుగాను సీడీవో ఐఎస్‌వో– 9001–2015 సర్టిఫికెట్ దక్కించుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఐఎస్‌వో సర్టిఫికెట్‌ను సీడీవో సీఈ శ్రీనివాస్‌కు అందజేశారు. జలవనరులశాఖ సలహాదారు బీఎస్‌ఎన్‌రెడ్డి, సీడీవో ఎస్‌ఈ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment