సాక్షి, అమరావతి: రాష్ట్రం ప్రశాంతతకు నిలయంగా మారింది. పోలీసు శాఖలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రధాన నేరాలు తగ్గడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ బుధవారం విడుదల చేసిన ‘వార్షిక నేర నివేదిక–2020’ రాష్ట్రంలో పరిస్థితుల్ని వివరించింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రధాన నేరాలు 15 శాతం తగ్గాయి. ప్రధానమైన నేరాలకు సంబంధించి 2019లో 1,11,112 కేసులు నమోదు కాగా, ఈ ఏడాది 94,578 కేసులు నమోదయ్యాయి. వాటిలో తీవ్రమైన నేరాలు గత ఏడాది కంటే ఈ ఏడాది 16 శాతం తగ్గాయి. ఆస్తిపరమైన నేరాలు 12 శాతం, శారీరక నేరాలు 2 శాతం, వైట్ కాలర్ నేరాలు 13 శాతం, మహిళలపై నేరాలు 7.5 శాతం తగ్గాయి.
జాతీయ సగటు కంటే రాష్ట్రంలో క్రైమ్ రేటు తక్కువే..
జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు సగటున క్రైమ్ రేటును పరిశీలిస్తే గత ఏడాది జాతీయ సగటు కంటే రాష్ట్రంలో క్రైమ్ రేటు బాగా తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment