సాక్షి, అమరావతి: కోవిడ్‌ను ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందని.. అందుకే ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంపై వస్తున్న తప్పుడు కథనాలపై ఆయన స్పందిస్తూ.. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే ఎల్లో మీడియా ఉద్దేశమన్నారు.
ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్నారని తప్పుడు రాతలు రాస్తున్నారని.. 70 శాతానికి పైగా ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘కనీస విలువలు పాటించకుండా తప్పుడు రాతలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చడమే వారి ఉద్దేశమని’’ సీఎం అన్నారు. తప్పుడు కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.
చదవండి: ఏపీ: 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు
విషం కక్కడమే ఎల్లోమీడియా ఎజెండా: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment