
అమరావతి: సీఎం వైఎస్ జగన్ పాలనలో దళితుల అభ్యున్నతి సాగుతుందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఎల్లోమీడియా కథనాలు రాస్తుందని విమర్శించారు.
ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఎక్కడా లేని సంక్షేమ పథకాలు.. ఏపీలో అమలవుతున్నాయని పేర్కొన్నారు. ఎస్సీ,ఎస్టీలకు చంద్రబాబు ఏంచేశారని ప్రశ్నించారు..? కాగా, ప్రతిపక్షాలు.. అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేయడం మానుకోవాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హితవు పలికారు.
చదవండి: అవార్డు గ్రహిత వీల్‌చైర్ ఫుట్‌స్టెప్స్‌ని సరి చేసిన సీఎం జగన్