
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త వర్సిటీల ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రకాశం, విజయనగరంలో జిల్లాల్లో కొత్త యూనివర్శిటీలకు, సాలూరులో కేంద్ర గిరిజన యూనివర్శిటీల ఏర్పాటుకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అరకులో రాష్ట్ర గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటుకు కూడా సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కడపలో ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ ఏర్పాటుపై కూడా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కురుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుపై కూడా సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నుంచే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment