
సాక్షి, విజయవాడ: దేవాలయాల వద్ద జియో ట్యాగింగ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఆదివారం ఆయన పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, పటిష్ట బందోబస్తు ఏర్పాటుపై పలు సూచనలు ఇచ్చారు. గతంలో నేర చరిత్ర కలిగిన వ్యక్తులను గుర్తించి వారిపై నిఘా ఉంచాలన్నారు. దేవాలయ కమిటీ సభ్యులు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మతపరమైన అంశాలపై పోలీసులు సున్నితంగా వ్యవహరించాలని కోరారు. సోషల్ మీడియాలో వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. ప్రతి దేవాలయం వద్ద పాయింట్ బుక్‌లు ఏర్పాటు చేయాలని, వాటిని స్థానిక అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. అగ్నిప్రమాదం నియంత్రణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ పేర్కొన్నారు. (చదవండి: 100 ఏళ్లు ఉండేలా కొత్త రథం)
(చదవండి: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతర నిఘా)
Comments
Please login to add a commentAdd a comment