
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది భూముల మార్కెట్ ధరలను పెంచకూడదని నిర్ణయించింది. కరోనా కారణంగా భూముల మార్కెట్ ధరలను పెంచడం లేదని స్పష్టం చేసింది. ప్రతియేటా ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువలు పెంచుతున్న ప్రభుత్వం.. వివిధ వర్గాలు, సాధారణ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈసారి ధరల మార్పు చేయడం లేదని పేర్కొంది.