land rates
-
ఫ్యూచర్‌సిటీ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ భూములపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌సిటీ చుట్టూ ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములపై పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తమ సన్నిహితుల ద్వారా ఆయా గ్రామాల్లోని వ్యవసాయ పట్టా భూముల ధరలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వ్యవసాయానికి అనుకూలంగా, భూగర్భజలాలు పుష్కలంగా, ఎర్రటి నేలలున్న భూములను కొనుగోలు చేసి పెట్టాలని కోరుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ యాచారం–కందుకూరు మండలాల సరిహద్దులో ఫ్యూచర్‌సిటీని నెలకొల్పడానికి సంకల్పించడం తెలిసిందే. కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీకి 300 అడుగుల రోడ్డు, మెట్రోరైలు మార్గానికి పచ్చజెండా ఊపింది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనే భావనతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పెట్టుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో తమ సన్నిహితులతో కలిసి వ్యవసాయ భూములను పరిశీలిస్తున్నారు. ఆ గ్రామాలపై ఫోకస్.. కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్‌పేట, ఆకులామైలారం, బెగరికంచె, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, దాసర్లపల్లి, లేముర్, గూడూర్, యాచారం మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, నందివనపర్తి, యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల, కొంగరకలాన్, మహేశ్వరం మండల పరిధిలోని రావిరాల, తుక్కగూడ తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌సిటీకి సమీపంలోని యాచారం, కందుకూరు గ్రామాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు ఫాంహౌస్లపై ఆసక్తి యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. భూగర్భ జలాలకు ఢోకా లేదు. అందుకే ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించుకుంటే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో ఉంది. అత్యధికంగా 5 నుంచి 10 ఎకరాల్లోపే కొనుగోలు చేసేలా దృష్టి సారించారు. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో.. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో సమీపంలోని గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలుకు కొంత మంది పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరైతే నేరుగా రైతులతోనే మాట్లాడుకుని వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రియల్ వ్యాపారి, హైదరాబాద్ -
భూములకు కొత్త విలువ
-
కోకాపేటలో భూముల రేట్లు పెరగడానికి కారణాలు..!
-
Hyderabad: కోకాపేట ‘కనకమే’.. ఎకరం రూ.100 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ఎకరం భూమి అంటే వేలల్లో.. ఆనక లక్షకో, రెండు లక్షలకో వచ్చేది. ఇప్పుడు రాష్ట్రంలో మారుమూల కూడా ఇరవై, ముప్పై లక్షలు లేకుంటే భూమివైపు చూసే పరిస్థితి లేదు. హైదరాబాద్‌లో, చుట్టుపక్కల అయితే కోట్లు పెట్టినా స్థలం దొరకడం కష్టమే. ఇప్పుడు కోకాపేటలో భూముల ధరలు అలాంటి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేశాయి. నియోపోలిస్ లేఅవుట్లో ఎకరానికి ఏకంగా రూ.100.75 కోట్ల ధర పలికి రికార్డు సృష్టించింది. హెచ్ఎండీఏ ఇదే లేఅవుట్లో ఇంతకుముందు నిర్వహించిన వేలంలో ఎకరానికి గరిష్టంగా రూ.60 కోట్ల రేటు పలకగా.. గురువారం నాటి రెండోదశ దాన్ని మించిపోయింది. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థల నుంచి అనూహ్య పోటీ కనిపించింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఇదే అత్యధికమని ఆ రంగానికి చెందిన నిపుణులు చెప్తున్నారు. ఎకరానికి రూ.వంద కోట్లకుపైగా ధర పలకడంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా హైదరాబాద్ చర్చనీయాంశమైందని అంటున్నారు. రెండు విడతలుగా బిడ్డింగ్.. నియోపోలిస్‌లో 7 ప్లాట్లలోని భూములకు గురువారం ఉదయం, సాయంత్రం రెండు విడతలుగా ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించారు. హెచ్ఎండీఏ అన్ని ప్లాట్లలో భూములకు ఎకరానికి రూ.35 కోట్ల కనీస ధరను నిర్ణయించింది. ఆన్లైన్ బిడ్డింగ్‌లో తొలి నుంచీ ఉత్కంఠభరిత పోటీ కనిపించింది. కనిష్టంగా ఎకరానికి రూ.67.25 కోట్ల నుంచి గరిష్టంగా రూ.100.75 కోట్ల వరకు ధర పలికింది. సగటున ఎకరానికి రూ.73.23 కోట్ల చొప్పున లభించినట్టు హెచ్ఎండీఏ అధికారులు ప్రకటించారు. గురువారం మొత్తం 45.33 ఎకరాల భూములకు వేలం నిర్వహించగా రూ.3,319.60 కోట్ల ఆదాయం లభించినట్టు తెలిపారు. హెచ్ఎండీఏ ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన భూముల వేలంపై వచ్చిన ఆదాయం కంటే ఇదే ఎక్కువని వివరించారు. ప్రత్యేక అనుమతులతో డిమాండ్ హైదరాబాద్ నగరానికి పడమటి వైపు ఉన్న కోకాపేట్ అంతర్జాతీయ హంగులతో దేశవిదేశాలకు చెందిన వ్యాపార సంస్థలను ఆకట్టుకుంటోంది. ఇక్కడ భవన నిర్మాణాలకు సంబంధించి అంతస్తులపై పరిమితి లేదు. అపరిమితంగా అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఉండటం.. గృహ, వాణిజ్యం, వ్యాపారం వంటి అన్నిరకాల వినియోగానికి అనుమతి ఉండటం.. రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు కోకాపేట్పై దృష్టి సారించడానికి కారణమైంది. ఒకవైపు ఔటర్‌రింగ్‌రోడ్డు, మరోవైపు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు నిర్మించతలపెట్టిన మెట్రో రైల్‌కు నియోపోలిస్ లేఅవుట్ అందుబాటులో ఉండటం మరింత డిమాండ్ పెంచింది. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నాలెడ్జ్ సొసైటీతోపాటు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ఫార్చూన్ 500 కంపెనీలు కూడా నియోపోలిస్ లేఅవుట్‌కు చుట్టూ ఐదు కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. భారీ స్థాయిలో మౌలిక సదుపాయాలతో.. హెచ్ఎండీఏ నియోపోలిస్ లేఅవుట్‌ను సుమారు రూ.300 కోట్లతో భారీ స్థాయిలో, ఉత్తమ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేసింది. విశాలమైన రహదారులు, డ్రైనేజీలు, మంచినీటి సదుపాయాలను కల్పించింది. ఇక్కడ తొలిదశలో ఒకటి నుంచి ఐదో ప్లాట్ వరకు మొత్తంగా 64 ఎకరాలను విక్రయించారు. ప్రస్తుతం 6, 7, 8, 9, 10, 11, 14వ నంబర్ ప్లాట్లలోని 45.33 ఎకరాలను వేలం వేశారు. ఈ ప్లాట్లు కనిష్టంగా 3.60 ఎకరాల నుంచి గరిష్టంగా 9.71 ఎకరాల వరకు ఉన్నాయి. నియోపోలిస్ లేఅవుట్ విశేషాలివీ.. ► నియోపోలిస్ లేఅవుట్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం హెచ్ఎండీఏ రూ.300 కోట్లు ఖర్చు చేసింది. సుమారు 40 ఎకరాల భూమిని అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకోసమే వినియోగించడం గమనార్హం. ► సైకిల్ ట్రాక్‌లు, ఫుట్‌పాత్‌లు, ఇతర సదుపాయాలతో 45 మీటర్లు, 36 మీటర్ల వెడల్పున్న అంతర్గత రోడ్లను నిర్మించారు. భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, ఇతర సదుపాయాలను సమకూర్చారు. ఇక్కడ కమర్షియల్, రెసిడెన్షియల్, ఎంటర్టైన్మెంట్ తదితర అన్నిరకాల వినియోగానికి ముందస్తు అనుమతులు ఇచ్చారు. ► నియోపోలిస్‌లో ఎన్ని అంతస్తుల వరకైనా హైరైజ్ బిల్డింగ్‌లను నిర్మించేందుకు అనుమతి ఉంటుంది. ► ఔటర్ రింగ్‌రోడ్డుకు కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 5 నిమిషాలు, ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాలు, హైటెక్‌సిటీకి 20 నిమిషాల వ్యవధిలో చేరుకొనేలా రోడ్డు నెట్వర్క్ అందుబాటులో ఉంది. ప్లాట్ నంబర్–10కు ఎందుకంత క్రేజ్ హెచ్ఎండీఏ గురువారం మొత్తం ఏడు ప్లాట్లను వేలం వేసినా.. అందులో 10వ నంబర్ ప్లాట్‌కు మాత్రం బాగా డిమాండ్ వచ్చింది. 3.60 ఎకరాల విస్తీర్ణమున్న ఈ ప్లాట్‌ను హ్యాపీ హైట్స్ నియోపొలిస్, రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థలు కలసి ఏకంగా ఎకరానికి రూ.100.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేశాయి. ఈ ప్లాట్ మిగతా ప్లాట్ల కంటే ఎత్తులో ఉంటుంది. దీనికి వెనక వైపు నుంచి గండిపేట చెరువు, ముందు నుంచి హైదరాబాద్ నగరం వ్యూ స్పష్టంగా కనిపిస్తుంది. అందువల్లే ఈ ప్లాట్‌కు పోటాపోటీ వేలం జరిగిందని ఓ నిర్మాణ సంస్థ ప్రతినిధి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ప్లాట్‌ను ఆనుకొని ఉన్న 11వ నంబర్ ప్లాట్‌లో 7.53 ఎకరాల స్థలం ఉంది. దీన్ని ఎకరం రూ.67.25 కోట్ల ధరతో ఏపీఆర్ గ్రూప్ సొంతం చేసుకుంది. పక్కపక్కనే ఉన్న రెండు ప్లాట్ల మధ్య ఎకరానికి రూ.33.5 కోట్ల తేడా ఉండటం గమనార్హం. ప్లాట్–10 స్థలంలో రెండు హైరైజ్ టవర్లను నిర్మించేందుకు రాజపుష్ప ప్రాపర్టీస్ సంస్థ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ హైదరాబాద్‌లోనే అత్యంత ఎత్తయిన నివాస సముదాయాలు వచ్చే అవకాశం ఉంది. ఇదేకాదు.. ప్రస్తుతం కోకాపేటలో నిర్మితమవుతున్న భవనాల్లో చాలా వరకు ఆకాశ హరŠామ్యలేనని.. ఈ ప్రాంతం మినీ షాంఘైగా మారనుందని రియల్ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. -
నేలను విడిచే అభివృద్ధా?
భూమి రేట్లు పెరగడం తాము చేసిన ‘అభివృద్ధి’కి మచ్చుతునకగా రాజకీయ నాయకులు ప్రచారం చేసుకోవడం శోచనీయం. రాజకీయ అధికారం బడుగులకు ఉండాలనే నినాదంతో వచ్చిన తెలుగుదేశం, భారత రాష్ట్ర సమితి నాయకులు దీన్ని వల్లె వేయడం ఇంకా ఘోరం. భూమి వ్యాపార వస్తువు అయితే, దాని ధరలు కోట్లకు చేరితే, సామాజిక అన్యాయం పెరుగుతుందనే స్పృహ ఈ నాయకులకు లేకపోవడం గర్హనీయం. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ విధానాల వల్ల భూమి క్రమంగా కొందరి పాలు అవుతున్నది. ఈ కొందరు దానిని తమ పెట్టుబడులు పెంచే ఆర్థిక సాధనంగా పరిగణిస్తున్నారు. చుట్టూ కంచె వేసి పడావు పెడుతున్నారు. ఇది ఆహార భద్రతకు ముప్పు! భూమిని చాలా సాధారణంగా చూడడం అలవాటు అయింది. అసలు భూమి ఒక సహజ వనరు అని గుర్తించేవారు, గుర్తు పెట్టుకునేవారు అరుదు. భూమి, నేల, మట్టి, మన్ను వంటివి పర్యాయ పదాలుగా వాడతారు. కానీ, భూమి మనకు అందించే సేవలు ఆ పదాలలో ఇమిడి ఉన్నాయి. సమస్త పచ్చదనం, నీళ్ళు, అనేక రకాల జీవరాశులకు ఈ భూమి ఆలవాలం. భూమి పైన, లోపట, అంతటా ఉండే సంపద అపారం. సహజ భూవినియోగాన్ని మానవులు టెక్నాలజీ దన్నుతో అసహజ రీతిలో మార్చుతున్నారు. దానికి ‘అభివృద్ధి’ అని పేరు పెడుతున్నారు. ప్రాణ వాయువు నిరంతరం అందాలంటే చెట్లు, చేమ ఉండాలి. నీళ్ళు ఉండాలి. అవన్నీ ఉండాలంటే నేల కావాలి. ఈ పరస్పర ఆధారిత ప్రకృతి రుతుచక్రాలను మరిచిపోతున్నాము. తెలంగాణాలో భూమి ఆధారంగా అనేక వృత్తులు, జీవనో పాధులు ఉండేవి. గ్రామాలలో ఆహార ఉత్పత్తికి, స్వయంసమృద్ధికి భూమి అవసరం. పేదరికంలో, ఆకలితో ఉండడానికి భూమి లేకపోవ డమే కారణమని గుర్తించి పేదలకు భూమి పంచడం ఒక రాజకీయ, ఆర్థిక, పాలనాంశంగా మారింది. అయితే, గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ విధానాల నేపథ్యంలో భూమి క్రమంగా కొందరి పాలు అవుతున్నది. ఈ కొందరు దానిని తమ పెట్టుబడులు పెంచే ఆర్థిక సాధనంగా పరిగణిస్తున్నారు. చుట్టూ కంచె వేసి పడావు పెడు తున్నారు. ఇది ఆహార భద్రతకు ముప్పు. పైగా లక్షలాది కుటుంబాల జీవన సాధనం హరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఎకరా ధర కోట్లలో ఉంటే పెట్టుబడి కొంత ఇక్కడకు మరలవచ్చుగాక, కానీ ధరలు శిఖరానికి చేరిన తరువాత ఆ భూమిలో ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది. రియల్ ఎస్టేట్ ధరలకు కూడా ఒక పరిమితి ఉంటుంది. అది దాటితే పెట్టుబడి మురిగిపోతుంది. ఆ ఆర్థిక పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. పేదలకు వ్యవసాయానికీ, ఆహారానికీ, ఇండ్లకూ భూమి దొరకదు. భూమి ఉన్నవాడు దాని నుంచి పెట్టుబడికి తగ్గ ‘లాభం’ వచ్చే వ్యాపారం లేక ఇబ్బంది పడతాడు. కోట్ల రూపాయల భూమిలో ఏ వ్యాపారం చేస్తే అన్ని కోట్లు తిరిగి వస్తాయి? అ వ్యాపారాలకు మార్కెట్లు ఉన్నాయా? అటువంటి భూమిలో అపార్ట్మెంట్లు, ఇండ్లు కడితే కొనగలిగే స్థోమత ఉన్నవాళ్ళు ఎంత మంది ఉంటారు? ఇండ్లు, వ్యాపార సముదాయాల మార్కెట్లు స్థానిక డిమాండ్ మేరకు ఉంటేనే ఉపయుక్తం. తెలంగాణా ప్రభుత్వం ఇటువంటి సమీక్ష చేయడం లేదు. చేసిన అప్పులు తీరాలంటే ప్రభుత్వ ఆదాయం పెరగాలి. అది రియల్ ఎస్టేట్ ద్వారా పెరుగుతుంది అని బలంగా నమ్మి భూ బదలాయింపు విధానాలు అమలు చేస్తున్నారు. తెలంగాణా అస్తిత్వ ఉద్యమాలకు అందరికీ భూమి అనేది బలమైన పునాది. కానీ అది తెలంగాణా ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలకు బలి అవుతున్నది. ధరణి, పారిశ్రామిక విధానాలు, భూసేకరణ చట్టం 2017, మునిసిపల్ చట్టం, పంచాయతీ రాజ్ చట్టం, పట్టణాల అభివృద్ధికి అడుగులు, భవనాల నిర్మాణానికి అప్పులు, రైతు బంధు వగైరా తెలంగాణా ప్రభుత్వ చర్యలు భూమి యాజమాన్యం కొందరి దగ్గరే ఉండే విధంగా ఉంటున్నాయి. బడుగులకు ఉన్న భూమిని అమ్ముకునే పరిస్థితి కల్పిస్తున్నది. ఏ ధరకు అమ్ముకున్నా ఆ కుటుంబం భూమి లేని కుటుంబంగా మిగులుతుంది. స్వతంత్ర జీవనోపాధి కోల్పోతుంది. భూమి అమ్మిన ధనం విద్యకు, సంతతి వికాసానికి ఉపయోగపడినా, ఉద్యోగం లేనిదే సుస్థిరం కాదు. అయితే మంచిదే. కాకుంటే, సమస్య ఇంకొక రూపం తీసుకుంటుంది. అటు ఉద్యోగం రాక, ఉపాధి లేక, భూమి కోల్పోయి రోడ్డు మీదకు వచ్చిన కుటుంబాల సంఖ్య తెలంగాణా ఏర్పడక ముందు కంటే తెలంగాణా వచ్చినాక ఇంకా పెరిగింది. పట్టణాలు, నివాసిత ప్రాంతాల విషయంలో ప్రణాళికబద్ధ అభి వృద్ధి పోయి దళారుల రాజ్యం వచ్చింది. స్థానిక పంచాయతీ ప్రతి నిధుల చేతి నుంచి నిర్ణయాధికారం అధికారుల వ్యవస్థకు మళ్ళింది. ఇది ఒక రకంగా పల్లెల మీద పట్టణం కొనసాగిస్తున్న సామ్రాజ్యవాదం. ఇదే మోడల్ తెలంగాణలో అన్ని పట్టణాల చుట్టూ అమలు చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్లు తయారు చేయటం, పల్లెలను విలీనం చేయటం, భూమి వినియోగం మార్చటం, ఫీజులు వసూలు చేయటం, తద్వారా అవినీతి సామ్రాజ్యానికి ఇంధనం అందించటం! ఈ క్రమంలో వ్యవసాయ భూమి తగ్గిపోయినా, చెరువులు మాయ మయినా, గుట్టలు విధ్వంసం అయినా, చెట్లు నరికివేసినా ఏ చట్టానికీ పట్టదు. ఈ మోడల్ చేస్తున్న పర్యావరణ హననంలో అనేక జీవ రాశులు, జీవనోపాధులు సమిధలు అయినాయి. గ్రామీణ ఉపాధి తగ్గిపోవడానికి కారణం వ్యవసాయ భూమి వ్యవసాయేతర పనులకు మరలడమే. ఒకవేళ గొర్రెల పథకానికి అవినీతి లేకుండా నిధులు ఇచ్చినా వాటిని మేపే భూములు లేకుంటే ఫలితం రాదు. తెలంగాణా ప్రభుత్వం ‘అభివృద్ధి’ పనులకు... అంటే, కొత్త రోడ్లు, ఉన్న రోడ్ల విస్తరణ, పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణాల విస్తరణ, చెత్త కుప్పలు, శ్మశానాలకు భూమిని సేకరిస్తున్నది. ఇది ఎక్కువ శాతం వ్యవసాయ భూమి అని గమనించాలి. ఆ భూమి మీదనే ఆధారపడి బతికే కుటుంబాలకు భూమికి బదులుగా భూమిని ఇవ్వవచ్చు, లేదా మెరుగైన జీవనోపాధి కల్పించవచ్చు. ఇవేమీ చేయ కుండా చట్టాలను, సహజ న్యాయ సూత్రాలను కాదని భూమిని బదలాయిస్తున్నది. ఆహారం పండించే భూమి వినియోగం మార్చితే భవిష్యత్తులో ఆహార కొరతకు కారణం అవుతుంది. పెద్ద రోడ్లు ఎత్తుగా కట్టడానికి టన్నుల కొద్దీ మట్టి, రాళ్ళను వాడుతున్నారు. ఈ ‘అవసరం’ కొరకు గుట్టలను పిండి చేశారు. లక్షలాది చెట్లను నరికివేశారు. పెద్ద రోడ్లు కడుతున్నది కార్లు వేగంగా పోవటానికి. వీటి వల్ల వ్యవసాయ భూమి పోతున్నది, వర్షం నీటిని ఒడిసిపట్టే చెట్లు, గుట్టలు పోతున్నాయి. భూమి వినియోగం మార్చితే నీటి కొరత వస్తుంది అనే స్పృహ అధికారులకు, నాయకులకు, ప్రజలకు కొరవడింది. నీళ్ళు వచ్చినా, విద్యుత్ ఉన్నా, చిన్న, సన్నకారు రైతులు భూములను ఎందుకు అమ్ముకోవాల్సి వస్తున్నది? వ్యవసాయం వారికి ఎందుకు లాభసాటిగా మారడం లేదు? ఈ ప్రశ్నలకు సమా ధానంగా సుపరిపాలన పథకాల రచన చేయాల్సి ఉండగా, కేవలం భూమి ధరలు పెంచి ఇదే ఆర్థిక అభివృద్ధి అని తెలంగాణా నాయ కులు గొప్పలకు పోతున్నారు. మట్టిలో తేమ కొన్ని వందల టీఎంసీల నీటికి సమానం. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభించేది. మట్టిని, నేలను, పచ్చదనాన్ని సంరక్షించే కార్య క్రమాల మీద పెట్టుబడి పెడితే రైతుల కమతాలలో నీరు దక్కేది. ఆహార పంటలకు అనువైన పర్యావరణంతో పాటు అప్పులు, వడ్డీల భారం ఉండేది కాదు. సుస్థిర ఫలితాలు వచ్చేవి. దీనికి వ్యతిరేక దిశలో అడుగులు వేసి తెలంగాణ ప్రభుత్వం పర్యావరణానికి విఘాతం కలిగించడంతో పాటు ఆర్థిక, సామాజిక వ్యవస్థలను కుదిపింది. ‘ఎంత ఖర్చు అయినా వెనుకాడం’ వంటి ప్రకటనల పర్యవసానంగా భూమితో కూడిన ఉత్పత్తి సంబంధాలు మారుతున్నాయి. భూమికి నీళ్ళు లక్ష్యంతో మొదలయ్యి, నీళ్ళ కొరకు భూమి అమ్మడం వ్యూహా త్మక తప్పిదం! పర్యావరణ హిత జీవనం మీద, సుస్థిర అభివృద్ధి మీద రాజకీయ, ఆర్థిక, సామాజిక వేత్తలు అత్యవసరంగా దృష్టి పెట్టకపోతే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వచ్చే ఉత్పాతాల నుంచి వెనుదిరిగే సమయం కూడా ఉండదు. దొంతి నరసింహా రెడ్డి వ్యాసకర్త విధాన విశ్లేషకులు ‘ 90102 05742 -
ఎల్ఆర్ఎస్ రసీదు పోయింది.. ఇప్పుడెలా? అ‘ధనం’ కట్టాల్సిందేనా?
‘మామునూరులో 200 గజాల ఓపెన్ ప్లాట్ ఉన్న వినయ్ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల ప్రకారం అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా భవన నిర్మాణ ఫీజు చెల్లించాలి. కానీ అతడు దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదును పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో తెరుచుకోకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఫీజు చెల్లించాల్సి వస్తోంది’ ‘నర్సంపేటలో ఉండే సిద్ధు్ద తనకున్న 160 గజాల ఓపెన్ ప్లాట్‌లో ఇళ్లు కట్టుకుందామనుకున్నాడు. ఓ లైసెన్స్డ్ సర్వేయర్‌ను సంప్రదించాడు. సేల్‌డీడ్ డాక్యుమెంట్లు, లేఅవుట్ కాపీతో పాటు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదు కావాలని సర్వేయర్ అడిగాడు. అది ఉంటే తప్ప అప్పటి మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజు దాదాపు రూ.20వేల వరకు తగ్గే అవకాశముందని చెప్పాడు. అయితే సిద్ధు ఆ రిసిప్ట్‌ను ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పటికీ.. సాంకేతిక సమస్యలతో దరఖాస్తు తెరుచుకోలేదు. దీంతో అతడికీ అదనంగా డబ్బు చెల్లించడం తప్పలేదు’ సాక్షి, వరంగల్: కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో సొంతిటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు ముందుకొస్తున్నారు. ఇటీవల పెరిగిన ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భవన నిర్మాణానికి ఆన్లైన్లో అదనంగా చెల్లించాలి. గతంలో ఎల్ఆర్ఎస్లో నమోదు చేసుకొని ఆ రసీదు పొంది ఉంటే.. ఇంటి పర్మిషన్‌కు కాస్త తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఎల్ఆర్ఎస్లో కట్టిన రసీదును నిర్లక్ష్యం చేశారు. దీనికి తోడు ఆన్‌లైన్‌లోనూ రసీదు లభించకపోవడంతో భవన నిర్మాణదారులకు అదనపు భారం తప్పట్లేదు. తెరుచుకోని సైట్! అక్రమ లే అవుట్లలో ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రెండేళ్లక్రితం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడంతో ప్రస్తుతం భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2020కి సంబంధించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రూ.వెయ్యి ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వసూలు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లు, ప్లాట్ల మార్కెట్ విలువను పెంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రుసుం మరింత పెరిగింది. దీనికి తోడు గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి రసీదు కలిగి ఉండి టీఎస్‌బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతి తీసుకుంటే గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే ఫీజు చెల్లించవచ్చు. కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీల పరిధిలో చాలా మంది ఆ రిసిప్ట్‌లను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడూ వెబ్సైట్ https://lrs.telangana.gov.in కు వెళ్లి ఫోన్ నంబర్ ఎంట్రీ చేస్తే ఓటీపీతో దరఖాస్తు ఓపెన్ కావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ఓపెన్ అవడం లేదు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావడం లేదు. దీంతో చాలామంది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజులు కడుతున్నారు. (చదవండి: పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని తన్ని తరిమేశారు..) ఇంటి నిర్మాణానికి సన్నద్ధం.. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గడంతో వేలాది మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లుగా ఎదురుచూసిన వేలాది మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎల్ఆర్ఎస్ చెల్లించి అప్పటి రిసిప్ట్ ఉంటే.. గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే భవన నిర్మాణ అనుమతికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలామంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో వివరాలు లభించక 14 శాతం ఎల్ఆర్ఎస్ రుసుంతో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ సైట్‌ను పునరుద్ధరించాలని, పురపాలక శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భవన నిర్మాణదారులు విన్నవిస్తున్నారు. (చదవండి: బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!) -
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
భూముల ధరలు: ఏపీ ప్రభుత్వం తీపి కబురు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది భూముల మార్కెట్ ధరలను పెంచకూడదని నిర్ణయించింది. కరోనా కారణంగా భూముల మార్కెట్ ధరలను పెంచడం లేదని స్పష్టం చేసింది. ప్రతియేటా ఆగస్టు ఒకటి నుంచి భూముల విలువలు పెంచుతున్న ప్రభుత్వం.. వివిధ వర్గాలు, సాధారణ ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులతో ఈసారి ధరల మార్పు చేయడం లేదని పేర్కొంది. -
ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే భూముల ధరలు తక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు ఆరు అంశాలను విస్తృతంగా ప్రచారం చేయడానికి ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేవారికి నష్టభయం లేకుండా.. జీవితకాలం చేయూత (హ్యాండ్ హోల్డింగ్)నందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల కనుగుణంగా ఆరు కీలక ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టిసారిస్తోంది. ముఖ్యంగా.. పెట్టుబడిలో అత్యధిక వ్యయమయ్యే భూమిని చౌకగా అందించడం, తక్కువ రేటుకే నీరు, విద్యుత్ సౌకర్యం, నైపుణ్యం కలిగిన మానవ వనరులను పుష్కలంగా అందుబాటులో ఉంచడం, ఏపీ వన్ పేరుతో ప్రాజెక్టు ప్రతిపాదన నుంచి ఆ పరిశ్రమ జీవితకాలం వరకు చేయూతనివ్వడంతోపాటు కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి ఇస్తున్న రాయితీలను బలంగా తీసుకెళ్లనుంది. ఈ ఏడాది దేశ విదేశాల్లో నిర్వహించే రోడ్ షోలు, పెట్టుబడుల సదస్సుల్లో ప్రధానంగా ఈ ఆరు అంశాలను వివరించనున్నారు. తక్కువ రేటుకే కావాల్సినంత భూమి.. పెట్టుబడులు అత్యధికంగా వచ్చే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి వాటితో పోలిస్తే తక్కువ రేటుకే కావాల్సినంత భూమి ఏపీలో అందుబాటులో ఉంది. మన రాష్ట్రంలో పరిశ్రమలకు ఒక ఎకరా సగటున రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షలకు లభిస్తుంటే ఈ రాష్ట్రాల్లో రూ.కోటి నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. ఏ రాష్ట్రాల్లో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) చేతిలో 48,352 ఎకరాల భూమి అందుబాటులో ఉంది. మరింత భూమిని కూడా సేకరిస్తోంది. కొత్త పారిశ్రామిక విధానంలో ప్రాజెక్టు ప్రారంభ వ్యయం తగ్గించేలా భూములను లీజు విధానంలో కేటాయిస్తోంది. విజయవంతంగా పదేళ్ల ఉత్పత్తి పూర్తి చేశాక వాటిని కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. మరోపక్క ప్లగ్ అండ్ ప్లే విధానంలో నేరుగా వచ్చి ఉత్పత్తి ప్రారంభించుకునేలా అన్ని వసతులతో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. పుష్కలంగా విద్యుత్, నీరు.. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరకే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. పోటీ రాష్ట్రాల్లో పరిశ్రమలకు యూనిట్ రూ.7 నుంచి రూ.10 వరకు చార్జ్ చేస్తుంటే ఏపీలో రూ.6 నుంచి రూ.7కే ఇస్తోంది. అలాగే పరిశ్రమలకు తక్కువ రేటుకే నిరంతరాయంగా నీటిని అందించడానికి ప్రత్యేక కంపెనీని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సముద్రపు నీటిని మంచి నీటిగా మార్చడంతోపాటు ప్రత్యేకంగా రిజర్వాయర్ల నుంచి పారిశ్రామిక పార్కులకు నీటిని తరలిస్తోంది. పోటీ రాష్ట్రాల్లో కిలో లీటరుకు రూ.45 నుంచి రూ.250 వరకు వసూలు చేస్తుంటే మన రాష్ట్రంలో రూ.50-55కే అందిస్తోంది. నైపుణ్యానికి పెద్దపీట రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే అవకాశాలు కల్పించేలా నైపుణ్యాభివృద్ధికి సర్కార్ పెద్దపీట వేస్తోంది. ఇందుకోసం స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీతోపాటు 30 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ వేతనానికే నైపుణ్యం కలిగిన కార్మికులు పెద్ద ఎత్తున అందుబాటులో ఉండటం కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో రోజుకు సగటున రూ.233.3 వేతనానికే నైపుణ్యం కలిగిన కార్మికులు అందుబాటులో ఉంటే పోటీ రాష్ట్రాల్లో రూ.280 నుంచి రూ.329 వరకు చెల్లించాల్సి వస్తోంది. రాయితీలతోపాటు చేయూత రాష్ట్రంలో ఏపీ వన్ ద్వారా పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలతో వచ్చినప్పటి నుంచి ఉత్పత్తి ప్రారంభించి.. అమ్మకాల వరకు జీవితకాలం చేయూత (హ్యాండ్ హోల్డింగ్)ను సర్కార్ అందిస్తోంది. సింగిల్ విండో విధానంలో 10 రకాల సేవలను కల్పిస్తోంది. పరిశ్రమ విస్తరణ కార్యక్రమాలు చేపట్టే వారికీ అనేక పారిశ్రామిక రాయితీలు ఇస్తోంది. భారీ పెట్టుబడులకు టైలర్‌మేడ్ విధానంలో రాయితీలు అందించనుంది. ఎలక్ట్రానిక్ రంగంలో ఉత్పత్తి ఆధారిత రాయితీలు, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)లో ఏర్పాటు చేసే యూనిట్లకు అదనపు రాయితీలను ఇస్తోంది. నష్టభయం లేకుండా.. రాష్ట్రంలో తక్కువ వ్యయంతో పరిశ్రమలు ఏర్పాటయ్యేలా మౌలిక వసతులు కల్పించడంతోపాటు నష్టభయం లేకుండా హ్యాండ్ హోల్డింగ్ అందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆదేశాల ప్రకారం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశాం. ప్లగ్ అండ్ ప్లే విధానంలో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతోపాటు సమగ్ర పారిశ్రామిక సర్వే ద్వారా పరిశ్రమలకు కావాల్సిన అవసరాలను తెలుసుకుని భర్తీ చేస్తున్నాం. ఇవే అంశాలను ప్రచారం చేయడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. -జవ్వాది సుబ్రహ్మణ్యం, డైరెక్టర్, రాష్ట్ర పరిశ్రమల శాఖ -
‘స్థిరాస్తి’ రంగం జోరు!
సాక్షి, సిటీబ్యూరో: మహానగర శివార్లలో కొత్త జిల్లా కేంద్రాల ఏర్పాటుతో స్థిరాస్తి రంగం జోరందుకుంటోంది. ఒకేసారి క్రయవిక్రయాలు భారీగా పెరిగాయి. కేవలం ఆరు మాసాల్లో రెండు లక్షలకు పైగా స్థిరాస్తుల దస్తావేజులు నమోదైనట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. స్థిరాస్తి వెంచర్లు, గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు పరుగులు తీస్తున్నాయి. వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు వెంచర్లుగా మారుతున్నాయి. వాస్తవంగా రాష్ట్ర విభజన అనంతరం స్థిరాస్తి రంగం జీవం పోసుకుంది. అప్పటివరకు నెలకొన్న అనిశ్చితి క్రమంగా తొలగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి మంత్రంతో కొత్త ప్రాజెక్టులు, పరిశ్రమలు. కార్పొరేట్ సంస్థలు, కంపెనీలు. కార్యాలయాలు తరలి రావడం స్థిరాస్తి రంగానికి మరింత కలిసి వచ్చినట్లయింది. తాజాగా నగర శివారులో శంషాబాద్(రంగారెడ్డి), మల్కాజిగిరి (మేడ్చల్) జిల్లా కేంద్రాల ఏర్పాటు దృష్ట్యా రహదారులు, ఇతర మౌళిక వసతులు అభివృద్ధికి అస్కారం ఉండటంతో భూములు, ప్లాట్లకు డిమాండ్ పెరిగినట్లయింది. కాసుల పంట.. రిజిస్ట్రేషన్ అండ్ స్టాంపుల శాఖకు కాసుల పంట పండుతోంది. 2016–17 ఆర్థిక సంవత్సరం..మొదటి ఆరు మాసాల్లో రాష్ట్రం మొత్తం మీద రూ.1935.30 కోట్ల ఆదాయం లభించగా, అందులో రూ.1359 కోట్లు మహానగరం నుంచే రాబడిగా నమోదు కావడం విశేషం. గత ఆరు మాసాల నుంచి వరుసగా నెలసరి ఆదాయం రెండువందల కోట్లకు తగ్గడం లేదు. గతేడాదితో పోల్చితే ఈసారి 35 శాతం పైగా ఆదాయం వృద్ధి పెరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా నగర శివార్లలోని ఉప్పల్, మేడిపల్లి, నారపల్లి, ఘట్కేసర్, కీసర, నాగారం, షామీర్పేట, మేడ్చల్, మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రాహీంపట్నం తదితర ప్రాంతాల్లో భూములపై ప్రజలకు ఆసక్తి పెరిగింది. దీంతో క్రయవిక్రయాలు పెరగడంతోపాటు ధరలు సైతం రెట్టింపయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రాబడి పరిస్థితి జిల్లా 2014–15 2015–16 2016–17 ఆదాయం ఆదాయం ఆదాయం (రూ.కోట్లలో) హైదరాబాద్ రూ.359.77 రూ. 327.49 రూ.445.77 రంగారెడ్డి రూ.479.53 రూ.714.34 రూ.953.71 -
భూముల మార్కెట్ విలువ పెంపు
-
భూముల మార్కెట్ విలువ పెంపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి. ఈ విలువను పెంచుతూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతుంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వారీగా ధరలు పెంచనున్నట్టు రిజిస్ట్రేషన్ శాఖ పేర్కొంది. ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రధాన వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ల ద్వారా మరింత ఆదాయాన్ని దండుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల కారణంగా ఆగస్టు 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాల్లో వివిధ గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతాయి. -
భూముల ధరలు పెంపు..?
ఆదాయం పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్లశాఖ నిర్ణయం మందగించిన స్థిరాస్తి వ్యాపారాన్ని గాడిలో పెట్టేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయ మార్గాలను అన్వేషించడం ఆరంచింది. ఆశించిన స్థాయిలో ఆదాయం రాబట్టాలంటే భూముల ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చింది. అన్ని రకాల భూములపై ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ కంటే 60 శాతం పెంచాలని నిర్ణయించింది. నల్లగొండ : జిల్లాలో కొన్ని రోజులుగా రియల్‌భూం స్తబ్దుగా ఉండడంతో రిజిస్ట్రేషన్లశాఖ ఆదాయమూ తగ్గింది. ఈ నేపథ్యంలో ఆదాయం రాబట్టుకునేందుకు భూముల రేట్లు పెంచాలని ఆ శాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన తర్వాత గతేడాది కాలంలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి కంటే రూ.82.13 కోట్ల ఆదాయం తగ్గింది. 2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం రూ.234.8 6 కోట్లు కాగా..కేవలం రూ.152.73 కోట్లు మాత్రమే సమకూరింది. దీంతో పునరాలోచించిన ప్రభుత్వం భూములు ధరలు పెంచాలని భావించింది. 2013లో చివరిసారిగా భూముల ధరలు పెంచారు. మళ్లీ రెండేళ్ల విరామం తర్వాత భూముల విలువ పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రియల్ వ్యాపారులను అయోమయానికి గురిచేస్తోంది. గతంలో అనామలీస్ పద్ధతిలో అన్ని వ్యవసాయ భూములపై కాకుండా భారీగా కొనుగోళ్లు జరుగుతున్న గ్రామాలను గుర్తించి మార్కెట్ ధరను పెంచేవారు. కానీ ఈసారి అలాకాకుండా అన్ని రకాల భూములపై ప్రస్తుతం మార్కెట్ విలువ కంటే 60 శాతం పెంచాలని నిర్ణయించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వె నక కారణాలు లేకపోలేదు. ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ప్రధానంగా యాదాద్రి ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి పర్చడంతోపాటు, సాగు, తాగునీటి రంగాలకు సంబంధించి పెద్దపీట వేసింది. అదీగాక గత రెండు, మూడు మాసాల కాలంలో హైదరాబాద్, నల్లగొండకు ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లో కొత్తగా అనేక వెంచర్లు వెలిశాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం భూములు ధరలు పెంచి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆదాయాన్ని రాబట్టుకునేందుకు పావులు కదుపుతోంది. అప్రమత్తమైన వ్యాపారులు... భూములు ధరలు పెరగబోతున్నాయన్న వార్తతో వ్యాపారులు అప్రమత్తమయ్యా రు. వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి రెండేళ్లకోసారి (ఏప్రిల్), పట్టణ ప్రాం తాల్లో ప్రతి ఏడాది (ఆగస్టు)లో ఒకసారి మార్కెట్ ధరను పెంచుతారు. కానీ రెం డేళ్ల నుంచి భూముల ధరల్లో ఎలాంటి మార్పూ లేకపోవడంతో ప్రభుత్వం ఏకబికి న ధరలు పెంచేందుకు సిద్ధమైంది. దీంతో వ్యాపారులు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లు చకచకా పూర్తిచేసుకుంటున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో కలిపి ప్రభుత్వానికి రూ.33.98 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది ఈ రెండు మాసాలు కలిపి ప్రభుత్వానికి కేవలం రూ.16 కోట్లు మాత్రమే వచ్చింది. ప్రధానంగా యాదిగిరిగు ట్ట రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో నాలుగింతల ఆదాయం పెరిగింది. గతేడాది ఏప్రిల్, మే మాసాల్లో రూ.2.70 కోట్లు ఆదాయం వస్తే...ఈ ఏడాది రెండు మాసాల్లోనే రూ.7.20 కోట్లకు చేరింది. యాదాద్రి అభివృద్ధిపై గురిపెట్టిన వ్యాపారులు వందల ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేశారు. అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతాలు, ఆయకట్టు ప్రాంతాల్లో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు భారీగానే జరిగాయి. కమిటీల ఏర్పాటు... భూముల విలువ అంచనా వేసేందుకు జిల్లా స్థాయిలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు ఆయా రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిధిలో భూముల మార్కెట్ విలువకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. రియల్ వ్యాపారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు. అనామలీస్ పద్ధతిలో భూ ము విలువ లెక్కించాలని వ్యాపారులు సూచిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం అన్ని రకాల వ్యవసాయ భూముల ధరలు 60 శాతం పెంచే విధంగానే ముందుకుపోతున్నారు. జూలై నాటికి ఈ కసరత్తు పూర్తిచేస్తారు. ఆగస్టు నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. -
భూముల రేట్లు పెంచితే ఊరుకోం: బాబు
విజయవాడ: త్వరలో విజయవాడ నుంచే పరిపాలన ప్రారంభిస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు వెల్లడించారు. శనివారం విజయవాడలో డీడీ సప్తగిరి ఛానల్‌ను వెంకయ్యనాయుడుతో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి ప్రాంతాలను మెగా సీటిగా అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు భూములు రేట్లు పెంచితే చూస్తు ఊరుకోమని రియల్టర్లను హెచ్చరించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని రైతులకు పిలుపు నిచ్చారు. పెరిగిన వృద్ధాప్య, వికలాంగుల ఫించన్లు అక్టోబర్ 2 నుంచ అమలు చేస్తామన్నారు. -
భూముల ధరలకు రెక్కలొచ్చాయ్!!
-
బైపాస్...టైం పాస్
వనపర్తిలో బైపాస్ రహదారి నిర్మాణానికి అధికార యంత్రాంగం చేస్తున్న కసరత్తు అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు చందలా మారుతోంది. భూమి కొనుగోలుకు అప్పట్లో రూ. 50లక్షలు కేటాయించి పదెకరాలు సేకరించాలనుకున్నారు. రూ.1.50 లక్షలు వెచ్చించి సర్వే చేయడంతో పట్టణవాసుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇంతలో భూమిరేట్లకు రెక్కలు మొలవడంతో అధికారులకు సేకరణ అంశం క్లిష్టంగా మారింది. నేతలూ దీనిపై పెదవి విప్పకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఫలితంగా ఏడేళ్లుగా ఆ దిశగా ఒక్క అడుగూ పడలేదు. ఇప్పుడు సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ అంశం మళ్లీ తెరమీదకొచ్చింది. నేతల నోటికి తాళం ఎందుకు...? రోజూ రోజుకు పెరిగిపోతున్న టాఫిక్ సమస్య నియంత్రిచేందుకు గతంలో వనపర్తిలో రింగ్ రోడ్డు ఏర్పాటును ప్రతిపాదించారు. గతంలోనే ఇక్కడ బైపాస్ రహదారి నిర్మించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు మంజూరైన నిధులు సహితం రెండున్నరేళ్లపాటు నాన్చినాన్చి తిరిగి పంపించేశారు. ప్రగల్భాలు పలికిన మన నేతలు సైతం నోటికి తాళం వేసుకొని ఉండటంతో బైపాస్ రహదారి లక్ష్యం నీరుగారుతూ టైంపాస్‌గా మారింది. అటు రోడ్ల విస్తరణ జరగాక, ఇటు బైపాస్ రహదారి అమలుకు నోచుకోకపోవడంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయి. అప్పటి గ్రామీణాభివద్థి శాఖ మంత్రి చిన్నారెడ్డి సూచన మేరకు 2008 మేలో ఇక్కడి అధికారులు బైపాస్ రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి అప్పటి రోడ్డు భవనల శాఖ మంత్రి జీవన్‌రెడ్డికి, ఆ శాఖ ఇంజనీర్‌కు ప్రతిపాదనలు పంపించారు. రూ. 37 కోట్లు అవసరం ఆవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. పట్టణ శివారు ప్రాంతంతోని చిట్యాల రోడ్డు, గోపాల్పేట్, పానగల్, పెబ్బేర్ రహదారులను కలుపుతూ ప్రతిపాదనలు రూపొందించారు. సుమారు 8 కిలో మీటర్ల పోడవున దీనిని అమలు చేయాలన్నుకున్నారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకరావడంలో అప్పటి మంత్రి విఫలమైయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రావుల చంద్రశేఖర్‌రెడ్డి సహితం ఈ ఊసే ఎత్తకపోవడంతో రింగ్ రోడ్డు ఏర్పాటు కలగానే మిగిలిపోయింది. గతంలో బైపాస్ రహదారి నిర్మాణం చేయడానికి హాడవిడి చేసిన నేతలు ఇప్పుడు బైపాస్ గురించి మాట్లాడటంగానీ, అలాంటి ప్రయత్నాలు నేతలెవ్వరూ చేయడం లేదనేది బహిరంగా రహస్యమే. స్థల సేకరణ జగని కారణంగా బైపాస్ రహదారికి మంజూరైన రూ.80 లక్షలు రెండేళ్ల పాటు మురిగి వెనక్కి వెళ్ళిపోయాయంటే మన నేతల అలసత్వం ఏ పాటిదో అర్ధం అవుతుంది. 2005లో అప్పటి సీఎం దివగంత వైఎస్సార్ నగరబాటలో భాగంగా వనపర్తి పట్టణంలో రహదారుల అభివద్థి ఏర్పాటుకు రూ. 2.5కోట్ల నిధులు కూడా మంజూరు చేశారు. పెబ్బేర్, కొత్తకోట, రహదారుల విస్తరణ రూ. 1.70 కోట్లతో పనులు చేపట్టారు. మిగిలిన రూ. 80 లక్షలతో బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించనున్నారు. నిర్మాణం ఇలా చేయాలన్నుకున్నారు... వనపర్తిలోని చిట్యాల చింతల హనుమాన్ దేవాలయం రాజనగరం, నాగవరం, క్రాస్ రోడ్డు వరకు సుమారు 1.6 కిలో మీటర్ల పోడవు 20-30 ఫీట్ల వెడల్పుగా బైపాస్ రహదారిని ఏర్పాటు చేయాలని భావించారు.