
భూముల మార్కెట్ విలువ పెంపు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి. ఈ విలువను పెంచుతూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఆగస్టు 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని 13 జిల్లాల్లో భూముల రిజిస్ట్రేషన్ విలువ పెరుగుతుంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల వారీగా ధరలు పెంచనున్నట్టు రిజిస్ట్రేషన్ శాఖ పేర్కొంది.
ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రధాన వనరుగా ఉన్న రిజిస్ట్రేషన్ల ద్వారా మరింత ఆదాయాన్ని దండుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఉత్తర్వుల కారణంగా ఆగస్టు 1 నుంచి ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 13 జిల్లాల్లో వివిధ గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం భూముల రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతాయి.