ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు | AP Govt Announces 13 Model Degree Colleges | Sakshi
Sakshi News home page

ఏపీలో రూ.40 కోట్లతో 13 మోడల్ డిగ్రీ కాలేజీలు

Published Wed, Jul 29 2020 12:49 PM | Last Updated on Wed, Jul 29 2020 1:51 PM

AP Govt Announces 13 Model Degree Colleges - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాలోనూ ఒక డిగ్రీ కాలేజీని మోడల్‌ కళాశాలగా తీర్చి దిద్డాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 13 మోడల్‌ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ ఇన్స్‌టిట్యూషనల్ ఫ్రేమ్ వర్క్‌(ఎస్ఎఆర్ఎఫ్)కు పైలెట్ ప్రాజెక్టుగా ఆ 13 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలనే ఎంపిక చేసింది.ఇందుకోసం రూ.40.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

శ్రీకాకుళంలోని జీడీసీ (ఎం), విజయనగరం జిల్లా సాలూరులోని జీడీసీ,విశాఖలో డాక్టర్ వీఎస్ కృష్ణా జీడీసీ, రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ కాలేజీ (ఏ), పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని ఎసీఐఎం, కృష్ణా జిల్లా విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీ, గుంటూరులో మహిళా డిగ్రీ కాలేజీ, ఒంగోలులో మహిళా డిగ్రీ కాలేజీ, నెల్లూరులోని డీకేడబ్ల్యూ కాలేజీ, అనంతపురంలో పురుషుల డిగ్రీ కాలేజీ, చిత్తూరులో పీవీకేఎన్, కర్నూలులోని సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజీ, కడపలోనిపురుషుల డిగ్రీ కాలేజీని ఎఆర్ఎఫ్ పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement