AP: పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుంది | apanese entrepreneurs Team Praise On AP Investment promotion policy | Sakshi
Sakshi News home page

AP: పెట్టుబడుల ప్రోత్సాహక విధానం బాగుంది

Published Tue, Apr 4 2023 8:37 AM | Last Updated on Tue, Apr 4 2023 11:30 AM

apanese entrepreneurs Team Praise On AP Investment promotion policy - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలోని పెట్టుబడుల ప్రోత్సా­హక విధానం బాగుందని జపాన్‌ పారిశ్రామిక­వేత్తల బృందం కొనియాడింది.  జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌­(చెన్నై) తగ మసయుకి నేతృత్వంలోని ఆ దేశ ఎక్స్‌టర్నల్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధుల బృందం సోమవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను, ఏపీఐఐసీ ఉన్నతాధి­కారి సృజనను కలిసింది. ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకా­శాలు, ప్రోత్సా­హ­కానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడు­తున్న విధానాలను వివరించారు.

జపాన్‌కు చెందిన పలు దిగ్గజ కంపె­నీలు ఇప్పటికే ఏపీలో భారీ­గా పెట్టుబడులు పెట్టాయని వివరించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని మంత్రి కోరారు. సమావే­శంలో జపాన్‌కు చెందిన ఇసుజు, యూనిచార్మ్, కొబెల్కో, వన్‌స్టీల్‌ ప్లేట్, పియో­లాక్స్, మియామా ఎలక్ట్రిక్, ఎంయూఎఫ్‌జీ బ్యాంక్‌  తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎస్‌తోనూ భేటీ..
జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌(చెన్నై) తగ మసయుకి సోమవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌­రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జపాన్‌ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement