
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఈ నెల 31న రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష ఏపీసెట్ 2021 నిర్వహించనున్నట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 78 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్న ఏపీసెట్‌కు 36,667 మంది దరఖాస్తు చేశారన్నారు. పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని, గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతిస్తామన్నారు.
పరీక్షకు నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి హాజరు కావాలని, తమ వెంట వాటర్ బాటిల్‌ను తీసుకురావచ్చన్నారు. దివ్యాంగులు ఒక రోజు ముందుగానే సహాయకుని కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. హాల్‌టికెట్లు ఏపీసెట్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment