
ఫైల్ ఫోటో
సాక్షి, విజయనగరం: దేశంలో ప్రధానమంత్రి మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభ పరిణామం అన్నారు. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సి్‌న్ తొలి టీకా అందించనున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా 26 వేల మంది పబ్లిక్, ప్రైవేటు హెల్త్ సిబ్బందికి వ్యాక్సిన్ అందిస్తున్నామని వెల్లడించారు. 5 రోజుల వరకు ఈ కార్యక్రమం చేపడతామని, జిల్లాలో 15 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.
ఒక్కో సెంటర్ ద్వారా రోజుకి 100 మందికి వ్యాక్సిన్ అందిస్తామని, ఫ్రెంట్ లైన్ వారియర్స్‌కు అందరికి వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. 18 ఏళ్ల లోపు ఉన్నవారికి, బాలింతలకి వ్యాక్సిన్ వేయబడదన్నారు. రెండో విడత కూడా ఇదే రకం వ్యాక్సిన్ అందజేయాలన్నారు. ఇప్పడు వ్యాక్సిన్ వేసిన వ్యక్తికి మరలా 28 రోజుల తర్వాత రెండో విడత వ్యాక్సిన్ అందజేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ అందజేస్తామని, ఎవరూ తొందరపడొద్దని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment