మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు | Central Election Commission releases schedule MLC elections | Sakshi
Sakshi News home page

మార్చి 13న ఎమ్మెల్సీ ఎన్నికలు

Published Fri, Feb 10 2023 4:08 AM | Last Updated on Fri, Feb 10 2023 7:56 AM

Central Election Commission releases schedule MLC elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ / సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 9 స్థానిక సంస్థల నియోజకవర్గాలు, 3 పట్టభద్రులు, 2 టీచర్ల నియోజకవర్గాలకు మార్చి 13న ఎన్నికలు నిర్వ­హించనున్నారు. ఇందుకోసం ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మార్చి 16న కౌంటింగ్‌ చేపడతారు.

కౌంటింగ్‌ పూర్త­యిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. నామినేషన్లకు చివరి తేదీ ఈ నెల 23 కాగా, ఉపసంహరణకు ఈ నెల 27 చివరి తేదీగా నిర్ణయించారు. పోలింగ్‌ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. తెలంగాణలో 1 టీచర్‌ (హైదరాబాద్‌–రంగా­రెడ్డి– మహబూబ్‌నగర్‌) ఎమ్మెల్సీ, 1 స్థానిక సంస్థల (హైదరాబాద్‌) స్థానాల్లో కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. 

ఏపీలో ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు: అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు 

టీచర్స్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే స్థానాలు : ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు కడప – అనంతపురం – కర్నూలు

పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు : 
1. ప్రకాశం– నెల్లూరు –చిత్తూరు
2. కడప– అనంతపురం– కర్నూలు
3. శ్రీకాకుళం– విజయనగరం– విశాఖపట్నం

షెడ్యూల్‌: 
నోటిఫికేషన్‌ : ఫిబ్రవరి 16
నామినేషన్లకు చివరి తేది : ఫిబ్రవరి 23
నామినేషన్ల పరిశీలన: ఫిబ్రవరి 24
నామినేషన్‌ ఉపసంహరణ : ఫిబ్రవరి 27
ఎన్నిక : మార్చి 13
ఫలితాలు: మార్చి 16  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement