
సాక్షి, ఢిల్లీ: ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే ఆంధ్రప్రదేశ్‌కు రుణాలు తీసుకునేలా అనుమతించామని కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో మంగళవారం తెలిపింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రతి రాష్ట్రానికి రుణ పరిమితి నిర్దేశించామని పేర్కొంది. 15వ ఆర్థిక సంఘం జీఎస్‌డీపీ ఆధారంగా ఆయా రాష్ట్రాల ఆర్థిక ప్రణాళికలు సూచనలు చేస్తోందని కేంద్రం వివరించింది. జీఎస్‌డీపీలో 4 శాతం వరకు రుణాలు తీసుకునేలా అనుమతించామని కేంద్రం వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment