
కర్నూలు(సెంట్రల్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో సీఎం ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి అవుకు పట్టణానికి హెలికాప్టర్‌లో వెళతారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం విజయవాడకు తిరిగి వెళతారు.
Comments
Please login to add a commentAdd a comment